epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు

టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు
ఏఏఐ చేతికి భూముల అప్పగింత
253 ఎకరాలు సేకరించిన రాష్ట్రం
ఎకరానికి రూ.1.20 కోట్ల పరిహారం
జనవరిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ మామునూరు విమానాశ్రయ పునర్నిర్మాణానికి మరో కీలక మైలురాయి దాటింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం శ‌నివారం అధికారికంగా అప్పగించింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు స్పష్టమైన దారి తెరచుకుంది. శనివారం ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు బృందంతో కలిసి వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకోగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో భూసంబంధిత పత్రాలను అధికారులకు అందజేశారు. అన్ని అనుమతులు, భూసేకరణ పూర్తికావడంతో 2026 జనవరిలో పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ గేమ్‌చేంజర్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు భారీ పరిహారం

విమానాశ్రయ విస్తరణకు అవసరమైన అదనపు భూముల కోసం మామునూరు పరిసర గ్రామాలైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి మొత్తం 253 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం చెల్లిస్తూ కేవలం ఏడాది కాలంలో భూసేకరణను పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో 136 మంది రైతులు, స్థానికులు భూములు కోల్పోయినా, న్యాయమైన పరిహారం అందడంతో వారు సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మామునూరు పాత విమానాశ్రయ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఏఏఐ పరిధిలో ఉంది. నూతన విస్తరణకు కావాల్సిన భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. గతంలో భూసేకరణ, పునరావాస వ్యయాల కోసం మరో రూ.250 కోట్లు కేటాయించగా, కేంద్ర విమానయాన శాఖ కూడా రూ.450 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధుల కొరత లేకుండా పనులు ముందుకు సాగుతున్నాయి.

నిజాం కాలం నుంచే విమానాశ్రయం

1930లో నిజాం పాలనలోనే మామునూరులో విమానాశ్రయం ఏర్పాటైంది. 1980లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అప్పటి నుంచి పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో రీజినల్ కనెక్టివిటీ పథకం కింద అభివృద్ధి ప్రతిపాదనలు వచ్చినా, వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.