epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌లో ‘షేర్’ ఫార్ములా ?

కాంగ్రెస్‌లో ‘షేర్’ ఫార్ములా ?
ములుగు చైర్మన్ పీఠానికి ఇద్దరికీ అవకాశం?
కాంగ్రెస్ క్యాంపులో ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు
స్వాతి, చంద్రకళల మధ్య పదవి పంపిణీపై ప్రచారం
బీసీ మహిళ రిజర్వేషన్‌తో కాంగ్రెస్‌లో అంతర్గత పోటీ
రేసులో నలుగురు మహిళా కౌన్సిలర్లు
మంత్రి సీతక్క వద్ద లాబీయింగ్
క్యాంపు రాజకీయాల తర్వాత సమన్వయానికి ప్రయత్నాలు
రేపటి ఎన్నికతో తొలి చైర్మన్ ఎవరో తేలనున్న ఉత్కంఠ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నలుగురు మహిళా కౌన్సిలర్లు బరిలోకి దిగడంతో పార్టీ అంతర్గతంగా పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరికి చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాల చొప్పున పంచే ఫార్ములా అమల్లోకి రావచ్చన్న ప్రచారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం 20 వార్డులు ఉన్న ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఐదు స్థానాలు, స్వతంత్రులు రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. అయితే అదే పార్టీలో నలుగురు మహిళా కౌన్సిలర్లు పీఠం కోసం పోటీ పడటం నాయకత్వానికి సవాల్‌గా మారింది.

నలుగురు మహిళా నేతల మధ్య పోటీ

చైర్మన్ రేసులో నాలుగో వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని నిరంజన్ చారి, మూడో వార్డు నుంచి విజయం సాధించిన యాసం వసంత రవికుమార్, ఆరో వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రధానంగా ఉన్నారు. ఈ నలుగురూ తమ తమ రాజకీయ నేపథ్యం, వర్గాల మద్దతుతో మంత్రి సీతక్క వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేసినట్లు సమాచారం. నల్లెల్ల స్వాతి కుటుంబానికి ప్రాంతీయంగా మంచి రాజకీయ చరిత్ర ఉండగా, గుంటోజు పావని స్వాతంత్ర్య సమరయోధుడు గుంటోజు నరసయ్య కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు బలంగా మారింది. యాసం వసంత కుటుంబానికి మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు ఉండగా, చంద్రకళ భర్త బిక్షపతి కూడా పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.

క్యాంపు రాజకీయాలు… కీలక ఫార్ములా

చైర్మన్ ఎంపికపై విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి సీతక్క గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను హైదరాబాద్‌కు తరలించి క్యాంపు నిర్వహించినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం పార్టీలో సమతుల్యతను కాపాడే విధంగా ఒక కీలక ఫార్ములా రూపుదిద్దుకున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం నల్లెల్ల స్వాతి భరత్ కుమార్, చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి మధ్య చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాల చొప్పున పంచే ప్రతిపాదనకు సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇద్దరికీ అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో అసంతృప్తిని నివారించాలన్న వ్యూహం అమల్లోకి రావచ్చన్న చర్చ సాగుతోంది.

రేపటి ఎన్నికతో క్లారిటీ

ఈ ఫార్ములా అమల్లోకి వస్తే తొలి రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది రేపటి ఎన్నికతో స్పష్టత రానుంది. ఒకే పదవిని ఇద్దరికి పంచే విధానం స్థానిక రాజకీయాల్లో అరుదుగా కనిపించే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఫార్ములా భవిష్యత్తులో పార్టీ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ములుగు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది రేపటి ఎన్నికతో తేలనుండగా, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.