హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం
వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా రెయిన్‌కోట్లు అందజేత
ఎలాంటి వాతావరణంలోనైనా విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల
కాకతీయ, వరంగల్ : హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చలి, వర్షాకాలంలో విధులు నిర్వహించేందుకు అవసరమైన రెయిన్‌కోట్లను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వరంగల్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల, ఐపీఎస్ మాట్లాడుతూ హోంగార్డులు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా రెయిన్‌కోట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు కే.రమేష్, కే.విజయ్, యస్.వేంకటేశ్వరరావు, కే.రవీందర్, డి.సోమాని, సీఐలు యం.రామ్మూర్తి, కే.అశోక్, యం.రజ్యాలక్ష్మి, ఆర్‌ఐలు టి.చంద్రశేఖర్, యస్.మహేష్, ఆర్‌ఎస్‌ఐ పి.అరుణ, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

