epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లక్ష్మీపురం మార్కెట్‌లో బకాయి బాగోతం!

లక్ష్మీపురం మార్కెట్‌లో బకాయి బాగోతం!
నాలుగు షాపులపై కోర్టు వివాదం.. అయినా కొన‌సాగుతున్న వ్యాపారం
రూ.39.82 లక్షల బకాయిలు..ఆరేళ్లుగా కొత్త టెండర్లు లేవు..
బకాయిదారులకు ఆక్షన్‌ మినహాయింపు ఎందుకు?
మార్కెట్‌ అధికారుల తీరుపై రైతుల ప్రశ్నలు

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : షాపులు దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం.. ఆ తర్వాత కిరాయిల చెల్లింపులో చేతులెత్తేయడం.. బకాయిలు పేరుకుపోయినా చర్యలు మాత్రం కొందరిపైనే! వరంగల్‌ ఏనుమాముల పరిధిలోని లక్ష్మీపురం మోడల్‌ కూరగాయల మార్కెట్‌లో కమర్షియల్‌ షాపుల బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 30 షాపుల్లో ఒకదాన్ని మార్కెట్‌ కార్యాలయానికి కేటాయించగా, మిగిలిన 29 షాపుల నుంచి రావాల్సిన బకాయిలు రూ.39,82,187కు చేరినట్లు మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు బకాయిల వసూళ్లలోనూ ఒకే విధానం పాటిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో అప్పటి మార్కెట్‌ పాలకవర్గం 29 కమర్షియల్‌ షాపులకు బహిరంగ టెండర్లు నిర్వహించింది. షాపుల పరిమాణాన్ని బట్టి 7 షాపులకు నెలకు రూ.3,850, 22 షాపులకు రూ.4,200 కనీస కిరాయిగా నిర్ణయించారు. అయితే టెండర్‌లో పోటీ పెరగడంతో కొందరు వ్యాపారులు కనీస ధర కంటే ఆరు రెట్లకు పైగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. కొన్ని షాపులకు నెలకు రూ.27 వేల వరకు కిరాయి కోట్‌ చేసి దక్కించుకున్నారు. ప్రతి షాపుదారుడి నుంచి రూ.50 వేల చొప్పున డీడీ రూపంలో ముందస్తు మొత్తాన్ని కూడా వసూలు చేసినట్లు సమాచారం.

లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో కోర్టు కేసు ఉన్నా తెరిచి ఉన్న షాపులు

రెండు నెలలకే బకాయిల పర్వం

షాపులు దక్కించుకున్న వ్యాపారులు మొదటి ఒకటి, రెండు నెలలు కిరాయిలు చెల్లించిన తర్వాత బకాయిలు పేరుకుపోయినట్లు మార్కెట్‌ వర్గాల సమాచారం. అధికారులు పలుమార్లు ఒత్తిడి తెచ్చి కొంత మొత్తం వసూలు చేసినప్పటికీ భారీగా బకాయిలు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. 2023లో కిరాయి చెల్లించని ఏడుగురు షాపుదారులను తొలగించి, ఆయా షాపులకు మళ్లీ టెండర్లు నిర్వహించినట్లు సమాచారం.
అయితే అందరిపైనా ఒకే రకమైన చర్యలు తీసుకున్నారా? లేక కొందరికి మాత్రమే మినహాయింపులు లభించాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. షాపు నంబర్లు 6, 7, 15, 18కు సంబంధించిన నలుగురు వ్యాపారులు కిరాయి చెల్లించలేమంటూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రావాల్సిన బకాయిలే రూ.26,67,600గా ఉన్నట్లు మార్కెట్‌ రికార్డులు పేర్కొంటున్నాయి. కోర్టు వివాదం నేపథ్యంలో ఆయా షాపులపై మార్కెట్‌ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంది? అన్నది ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం కోర్టు వివాదం కొనసాగుతున్న సమయంలో షాపుల నిర్వహణపై స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అక్కడ వ్యాపారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

తొమ్మిది మందికి ఎందుకు మినహాయింపు?

మిగిలిన 25 షాపుల్లో 8, 11, 13, 19, 20, 21, 26 నంబర్లతో ఉన్న ఏడు షాపులను బకాయిల కారణంగా ఓపెన్‌ ఆక్షన్‌కు పంపినట్లు సమాచారం. వీటి నుంచి రావాల్సిన బకాయి రూ.4,03,540గా ఉంది. మరో 18 షాపుల నుంచి రూ.9,11,047 బకాయి రావాల్సి ఉంది. ఇందులో షాపు నంబర్లు 4, 9, 12, 17, 24, 27, 28, 29, 30కు చెందిన తొమ్మిది మంది వ్యాపారుల వద్ద రూ.50 వేల నుంచి రూ.98 వేల వరకు బకాయిలు ఉన్నట్లు మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి. అయినప్పటికీ వీరిని ఓపెన్‌ ఆక్షన్‌ జాబితాలో ఎందుకు చేర్చలేదన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
బకాయి ఉన్న ఏడుగురిని వేలానికి పంపి.. అంతకంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న మరికొందరిని ఎందుకు మినహాయించారన్న దానిపై మార్కెట్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 2021లో కమర్షియల్‌ షాపులకు టెండర్లు నిర్వహించిన తర్వాత 2026 వరకు కొత్తగా అన్ని షాపులకు టెండర్లు నిర్వహించకపోవడంపైనా రైతులు, వ్యాపార వర్గాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. కిరాయిలు సక్రమంగా రాకపోయినా షాపులను కొనసాగించడం వెనుక కారణమేంటి? బకాయిల వసూళ్లకు మార్కెట్‌ యంత్రాంగం తీసుకున్న చర్యలేంటి? ఒకే విధమైన బకాయిదారులపై ఒకే రకమైన చర్యలు ఎందుకు లేవు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలని రైతులు కోరుతున్నారు. రూ.39.82 లక్షల బకాయిల వ్యవహారంలో షాపుల వారీగా వసూళ్లు, కోర్టు కేసులు, వేలం జాబితా, మినహాయింపులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి.. కాకతీయ, హనుమకొండ : ఓటర్ల...

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం?

కోఆప్షన్‌ ఎన్నికలకు ఎందుకింత భయం? బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నందుకే వాయిదా ఎన్నికై ఏడాది...

బాధిత కుటుంబాలకు భరోసా

బాధిత కుటుంబాలకు భరోసా మృతుల కుటుంబాలకు పార్టీ, వ్యక్తిగతంగా అండగా ఉంటా కుటుంబ పెద్దలను...

భాధిత కుటుంబాలకు భరోసా

భాధిత కుటుంబాలకు భరోసా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : ఇటీవల...

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి

పల్లె పండుగలతో ఆదర్శంగా నిలవాలి *మహిళలకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కాకతీయ,...

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు..

సైబర్ నేరాల నియంత్రణలో వరంగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. 9 నెలల్లో 3,952...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.