పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం
సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య సంబరం
అక్టోబర్ 11న హరిత కాకతీయలో వేడుక
శ్రీలేఖ సాహితి అధ్యక్షుడు టీ. శ్రీరంగ స్వామి
కాకతీయ, హనుమకొండ : శ్రీలేఖ సాహితి, వరంగల్లు స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ రచయిత, శ్రీలేఖ సాహితి ఉపాధ్యక్షుడు పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో కార్యక్రమం జరుగుతుందని శ్రీలేఖ సాహితి అధ్యక్షుడు టీ. శ్రీరంగ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలో డా. దహగాం సాంబమూర్తి, ఐతా చంద్రయ్య, డా. మడత భాస్కర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డా. రియాజ్, కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, డా. పర్చా అంజనీదేవి, టీ. ఉడయవర్లు, డా. అమ్మిన శ్రీనివాసరాజు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, డా. ఊరె సత్యవాణి, డా. ఎన్‌వీఎన్ చారి, గుడిపాటి, డా. పల్లేరు వీరాస్వామి తదితరులు పాల్గొననున్నారు. సాహితీ మిత్రులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.


