epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌!

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌!
కుమార్తె సంస్థ చెల్లింపులపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశం
వీణా, భర్త మహమ్మద్‌ రియాస్‌ పేర్లూ ప్రస్తావనలోకి
రూ.1.72 కోట్ల చెల్లింపులపై అవినీతి ఆరోపణలు
ప్రాథమిక విచారణతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ
ఎస్‌ఎఫ్‌ఐఓ అంచనా ప్రకారం సంస్థకు రూ.2.73 కోట్లు

కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : కుమార్తె వీణాకు చెందిన సంస్థకు అక్రమ చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్‌ నేత పినరయి విజయన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో విజయన్‌, ఆయన కుమార్తె వీణా, ఆమె భర్త, మాజీ మంత్రి మహమ్మద్‌ రియాస్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ బదరుద్దీన్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం రాష్ట్ర విజిలెన్స్‌, అవినీతి నిరోధక విభాగాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీణాకు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌ సంస్థకు కొచ్చి మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌, కన్సల్టెన్సీ సేవల పేరుతో 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 2023లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ దర్యాప్తు చేపట్టాయి. ఎక్సాలాజిక్‌ సంస్థ మొత్తం రూ.2.73 కోట్లు పొందినట్లు ఎస్‌ఎఫ్‌ఐఓ అంచనా వేసింది.

ప్రాథమిక విచారణపై సవాల్‌

ఈ కేసులో విజయన్‌, వీణా, రియాస్‌ తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌తో ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌ వద్ద అదనపు ప్రైవేట్‌ కార్యదర్శిగా పనిచేసిన కేఎం షాజహాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. వీణా, ఎక్సాలాజిక్‌ సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని సీపీఎం వాదిస్తోంది. సదరు చెల్లింపులు చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల్లో భాగమేనని పేర్కొంది. రాజకీయ ప్రేరణతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించిందని ఆరోపించింది. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తుపై ఆసక్తి నెలకొంది.

లావలిన్‌ కేసులోనూ గతంలో విచారణ

విజయన్‌ గతంలో విద్యుత్‌ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎస్‌ఎన్‌సీ లావలిన్‌ కేసులోనూ సీబీఐ దర్యాప్తు జరిగింది. 1995-97 మధ్య కేరళలో జలవిద్యుత్‌ ప్రాజెక్టుల ఆధునికీకరణ కోసం కెనడాకు చెందిన ఎస్‌ఎన్‌సీ లావలిన్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.374.50 కోట్ల నష్టం వాటిల్లిందన్న అభియోగాల నేపథ్యంలో విజయన్‌ పేరు కేసులో ప్రస్తావనకు వచ్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీకి కేబినెట్‌ అభినందనలు

మోదీకి కేబినెట్‌ అభినందనలు గుజరాత్‌ నుంచి దేశ నాయకత్వం వరకు 25 ఏళ్ల...

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం భారత్‌ దౌత్యంతో ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా అంగీకారం చివరి...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.