టీపీటీఎఫ్ ఇనుగుర్తి మండల నూతన కమిటీ
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్, సుక్క ఉప్పలయ్య
పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలి
టీపీటీఎఫ్ మండల శాఖ నూతన కమిటీ
కాకతీయ, ఇనుగుర్తి: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఇనుగుర్తి మండల శాఖ నూతన కమిటీని మండల శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వెంకటరమ నరసయ్య, పరిశీలకుడిగా సంఘ శ్రీనివాస్ పాల్గొన్నారు. మండల అధ్యక్షుడిగా కదిరే ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్య, ఉపాధ్యక్షులుగా సారంగపాణి, కౌసర్, కార్యదర్శులుగా రాజు, సాగర్, కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా వేణు, సభ్యుడిగా ఎండీ మహమ్మద్, అకాడమిక్ సెల్ కన్వీనర్‌గా దయాకర్, సభ్యులుగా సాయికుమార్, శైలజ, సతీష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ కాలపరిమితి ముగిసినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

