epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి
లో-వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి..
పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
చెల్పూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల ధర్నా

కాకతీయ, భూపాలపల్లి : రైతులకు న్యాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలు, లో-వోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మోటార్లు కాలిపోతూ పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూర్‌లో జాతీయ రహదారి 353పై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మండల రైతులు చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మద్దతు తెలిపారు. వరి పంట చివరి దశలో ఉండటంతో పాటు మిర్చికి నీటి అవసరం ఎక్కువగా ఉందని, ఈ కీలక సమయంలో విద్యుత్‌ సరఫరాలో కోతలు విధించడం రైతులకు నష్టం కలిగిస్తోందని అన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ అందించలేని పరిస్థితిలో కనీసం 15 నుంచి 16 గంటలైనా నాణ్యమైన సరఫరా చేయాలని గండ్ర కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్నా మధ్యలో పలుమార్లు కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ధర్నా చేస్తామని రైతులు ప్రకటించిన తర్వాత రాత్రిపూట విద్యుత్‌ సరఫరా చేసినప్పుడు సాధారణ రోజుల్లోనూ అదే విధంగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు, ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలని కోరారు. అవసరమైతే గృహ, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంలో సర్దుబాట్లు చేసైనా వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యాప్‌ విధానం వల్ల యూరియా, డీఏపీ ఎరువులు పొందడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గండ్ర విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేపట్టినట్లు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.