epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలి

రైతులకు కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలి
లో-వోల్టేజ్‌, కోతలతో పంట‌లు ఎండిపోతున్నాయి
సింగూర్‌ ప్రాజెక్టును ఖాళీ చేసి రైతులకు అన్యాయం చేశారు
ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వ‌జం
అన్నాసాగర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో క‌ల‌సి ధర్నా

కాకతీయ, ఆందోల్‌ : వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్‌ అందించలేని అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ డిమాండ్‌ చేశారు. లో-వోల్టేజ్‌, విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆందోల్‌ మండలం అన్నాసాగర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట వివిధ గ్రామాల రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) స్వయంగా వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

నీటిని సముద్రం పాలు చేసి.. విద్యుత్‌ కష్టాలు తెచ్చారు

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముందస్తు హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా కృష్ణా, గోదావరి జలాలను సముద్రం పాలు చేసిందని క్రాంతి కిరణ్‌ విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరిగేదని, ఇప్పుడు రైతులు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూనిట్‌కు రూ.4 చొప్పున విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాలను వదులుకొని, బహిరంగ మార్కెట్‌లో రూ.15 చెల్లించి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ వ్యవస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు.
సింగూర్‌ ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్న సమయంలో గేట్ల మరమ్మతుల పేరుతో నీటిని దిగువకు విడుదల చేసి ప్రాజెక్టును ఖాళీ చేయించారని మంత్రి దామోదర రాజనర్సింహపై క్రాంతి కిరణ్‌ విమర్శలు చేశారు. దీంతో ఆందోల్‌ నియోజకవర్గంలో రైతులు సాగునీరు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎండిపోతున్న పంటలను మంత్రి పరిశీలించి, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతులు మాట్లాడుతూ లో-వోల్టేజ్‌తో మోటార్లు పనిచేయడం లేదని, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతింటే భూ యజమానులకు కౌలు ఎలా చెల్లించాలని కౌలు రైతులు ప్రశ్నించారు. డీఈ వచ్చి సమస్యలకు పరిష్కారం చూపేవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. ఆందోల్‌ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీనియర్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి, మాసంపల్లి నారాయణ, లింగాగౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం కాంగ్రెస్ సర్కారు...

సైకిళ్లపై ప్రచారం చేయండి!

సైకిళ్లపై ప్రచారం చేయండి! అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన ఆరోగ్యంతో పాటు ప్రజల్లో...

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనపర్తి జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ...

Kondareddypalli: సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి శ్రీ...

Child Tragedy: విషాదం.. మట్టి గోడ కూలి బాలుడు మృతి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో...

సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ...

Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు...

రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: జూపల్లి సంచలన వ్యాఖ్యలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.