epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
సోషల్‌ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
సైబర్‌ వేధింపులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత పిలుపు

కాకతీయ, హ‌న్మ‌కొండ : బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత సూచించారు. సోషల్‌ మీడియాలో అపరిచితులతో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, సైబర్‌ వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు వరంగల్‌ జిల్లా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో బాలికా సంఘాలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్‌ ఏసీపీ సదయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికల భద్రత, మహిళా రక్షణ, వ్యక్తిగత అభివృద్ధి, సైబర్‌ నేరాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ సత్య శారద మాట్లాడుతూ కౌమార దశలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తూ జీవిత లక్ష్యాలను సాధించాలని బాలికలకు సూచించారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు మానసిక, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవాలని, అవసరమైనప్పుడు షీ టీమ్స్‌ సహాయం పొందాలని తెలిపారు. సైకాలజిస్ట్‌ డాక్టర్‌ బారుపాటి గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాను విచక్షణతో వినియోగిస్తూ సైబర్‌ మోసాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎల్‌. రాధిక మాట్లాడుతూ కౌమార దశలో కలిగే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. బాలికల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు బాలస్వామి, ఏసీపీలు సదయ్య, వెంకటరమణ, షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సువర్ణ, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్‌ ఓ. రమేష్‌, భరోసా కేంద్రం ఎస్‌ఐ కిరణ్మయి, షీ టీమ్స్‌ ఆర్‌ఎస్‌ఐ స్వాతి, ఎస్‌ఐ రామారావు తదితర పోలీస్‌ అధికారులు, తొమ్మిది మండలాల బాలికలు, మెప్మా, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీ రామగిరి...

సారే కావాలంటున్నారు..

సారే కావాలంటున్నారు.. కేసీఆరే మ‌ళ్లీ రావాలంటున్నారు.. బీఆర్ఎస్‌ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్‌...

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ...

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.