భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం
జగన్నాధపల్లిలో భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు
వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్.కిషోర్ కుమార్
కాకతీయ,రాయపర్తి : రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ )ఎల్.కిషోర్ కుమార్ అన్నారు.బుధవారం మండలంలోని జగన్నాధపల్లి గ్రామంలో సర్పంచ్ బద్దం సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ,అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సభలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే భూముల రీ-సర్వే ద్వారా ప్రతీ రైతుకు వారి భూమికి సంబంధించిన స్పష్టమైన హక్కులు, పక్కా కొలతలతో కూడిన రికార్డులు లభిస్తాయని అన్నారు.సర్వేలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.రైతులు తమ భూముల సరిహద్దులను సరిచూసుకోవాలని,ఈ ప్రక్రియలో రైతులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి శ్రీనివాసులు,ఆర్డిఓ టి.సుమ,తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీడీవో పాక శ్రీనివాసులు,ఎంఆర్ఐ కొయ్యాడ చంద్రమోహన్, ఏఆర్ఐ సంధ్యారాణి,సర్వేయర్లు,జిపిఓలు పాల్గొన్నారు.

