ములుగులో బార్ కేటాయింపు పూర్తి
ఒక్క బార్కు 376 దరఖాస్తులు
లక్కీ డ్రాలో 349వ టోకెన్ ఎంపిక
కాకతీయ, ములుగు : ములుగు మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఒక్క బార్ కోసం ఏకంగా 376 దరఖాస్తులు రాగా, శుక్రవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 349వ టోకెన్ నంబరు గల దరఖాస్తుదారుడు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ కేటాయింపునకు సంబంధించి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 376 దరఖాస్తులు అందాయి. వీటికి సంబంధించి శుక్రవారం లక్కీ డ్రా నిర్వహించి, 349వ టోకెన్ నంబరు గల దరఖాస్తుదారుడిని బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



