epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు

జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు
పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం ఆటపాటలతో హోరెత్తించిన మహిళలు
బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక – కుడా చైర్ పర్సన్ సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కమిషనర్ వెంకన్న

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ ప్రాంగణం శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా మారింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు పూల సోయగాలతో, సాంస్కృతిక వైభవంతో అంబరాన్నంటాయి.
ఈ వేడుకలకు కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీడబ్ల్యూఎంసీ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, నగర మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. పూల సోయగాలు, జానపద గీతాలతో జీడబ్ల్యూఎంసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

అనంతరం కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, బల్దియా స్పెషల్ ఆపీసర్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే పూలను పూజిస్తూ, ప్రకృతితో మానవ జీవితానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని తెలిపారు.బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, మహిళల ఆత్మగౌరవం, ఐక్యత, కుటుంబ అనుబంధాలు, సామాజిక సమైక్యతకు ప్రతిబింబమని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. నగర పరిశుభ్రత, రవాణా, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామన్నారు. బతుకమ్మ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, ఇతర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి

ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు...

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900

పత్తికి రూ.9,200.. మొక్కజొన్నకు రూ.2,900 ధరలు పెరగడంతో రైతుల హర్షం కాకతీయ, కేసముద్రం: కేసముద్రం...

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు...

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు...

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ...

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌

బతుకమ్మ సంబరాల్లో ములుగు కలెక్టరేట్‌ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి...

రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం

రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం విద్యుత్‌ కోతలతో ఎండుతున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.