పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు
కాకతీయ, నెల్లికుదురు: పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నెల్లికుదురు మండల శాఖ కు చెందిన ఉపాధ్యాయు లకు పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ లో నెల్లికుదురు మండల సభ్యులను ఎంపిక చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుంకరి బిక్షం గౌడ్,భట్టాపురం మధుసూదన్ రెడ్డి లు తెలిపారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు యుగంధర్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎన్నికకు సంహరించిన జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సతీష్ రెడ్డి,శ్రీధర్ లకు మండల శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నైనాల గ్రామంలోని ఎంపియుపిఎస్ హెచ్ఎం భూసాని సోమయ్య,కొత్త నరసింహా రెడ్డి, బొమ్మరాతి సాయిలు, జలగం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి,
పెరుమాండ్ల రమేష్, రాష్ట్ర కార్యదర్శులుగా చాగంటి స్వామి, పెనుకుల రవీందర్,
బోయిని రవీందర్, మామిడాల వెంకటేష్, తుమ్మ సతీష్ లు ఎంపికైనట్లు తెలిపారు.

