epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు!
మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం
సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి పోరాటం
వృత్తి నిపుణులతో ఏఐపీసీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తాం
100 పట్టణ జిల్లాల్లో ప్రొఫెషనల్స్‌ కమిటీల ఏర్పాటు
న్యాయ, వైద్య రంగాల్లో 100 సహాయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
పరిపాలనలో పారదర్శకతకు ‘షాడో మినిస్ట్రీ’ అవసరం
ఏఐసీసీ ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మోదీ పాలనలో రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, పౌర స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని, రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని రంగాల వృత్తి నిపుణులు ఏకతాటిపైకి రావాలని ఏఐసీసీ ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ సభ్యత్వంతో సంబంధం లేకుండా నిపుణులంతా తమతో కలిసి పనిచేయాలని కోరారు. ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన శ‌నివారం విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ వంటి పవిత్ర గ్రంథాలతో సమానమని మధుయాష్కీ పేర్కొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం, పౌరుల స్వేచ్ఛకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలనే ఉద్దేశంతో 2017లో రాహుల్‌గాంధీ ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు దాదాభాయ్‌ నౌరోజీ, మోతీలాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, మహాత్మాగాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నాయకులు ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

వృత్తి నిపుణులతో దేశవ్యాప్త విస్తరణ

న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు సహా వివిధ రంగాల నిపుణులు ఏఐపీసీలో భాగస్వాములు కావాలని మధుయాష్కీ కోరారు. దేశవ్యాప్తంగా తొలి దశలో 100 పట్టణ జిల్లాల్లో వృత్తి నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణను ఏఐపీసీకి నమూనాగా తీర్చిదిద్ది, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంస్థను విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడంతోపాటు చట్టాల రూపకల్పన, అమలులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం తమ లక్ష్యమన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన నిపుణులను తీర్చిదిద్దేందుకు మన్మోహన్‌సింగ్‌ ఫెలోషిప్‌ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు మధుయాష్కీ తెలిపారు. తొలి విడతలో ఏడాదిపాటు 50 మందికి శిక్షణ ఇచ్చామని, రెండో విడతకు 800 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ విడతలో 100 మందికి శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://manmohansinghfellows.com ద్వారా వివరాలు తెలుసుకొని పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

100 సహాయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

ప్రజలకు న్యాయ, ఆరోగ్య తదితర రంగాల్లో సహాయం అందించేందుకు ఏఐపీసీ ద్వారా 100 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మధుయాష్కీ వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష సంబంధం లేని మేధావులు, నిపుణుల సూచనలతో సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొద్దిమంది కార్పొరేట్‌ సంస్థలకు సంపదను కట్టబెడుతోందని ఆరోపించారు. దేశ నిర్మాణంలో నిపుణుల అనుభవాన్ని, సలహాలను వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించవచ్చన్నారు.

పారదర్శక పాలనకు ‘షాడో మినిస్ట్రీ’

ప్రభుత్వాల పనితీరును స్వతంత్రంగా పరిశీలించి, లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించే వ్యవస్థ అవసరమని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉన్న తరహాలో ‘షాడో మినిస్ట్రీ’ వ్యవస్థ ఉంటే పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 22-ఏ జాబితా భూముల విషయంలో కొందరు అధికారులు రెవెన్యూ మంత్రి, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇలాంటి వ్యవస్థ ఉంటే లోపాలను గుర్తించి, ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవో 118లోని లోపాలను గుర్తించి రెవెన్యూ మంత్రి, అధికారులకు సూచనలు చేశానని, అనంతరం మార్పులతో కొత్త నిబంధనలు పొందుపరిచారని వివరించారు. బ్రిటిష్‌ పాలకులతో చేతులు కలిపి స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర బీజేపీ వారసత్వానికి ఉందని మధుయాష్కీ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు మోదీ ప్రభుత్వం తలవంచుతోందని, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించినా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణ కోసం వృత్తి నిపుణులు ముందుకు వచ్చి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ...

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి!

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు..! గురువారం తెలంగాణ భవన్‌లో వ‌రంగ‌ల్...

విదేశీ మద్యం ధరలు పెంపు

విదేశీ మద్యం ధరలు పెంపు ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు...

మెడిక‌వ‌ర్ మాట మార్చింది

మెడిక‌వ‌ర్ మాట మార్చింది మిస్ట‌రీగా న్యాయ‌వాది ఐశ్వ‌ర్య మృతి 2 ఎంఎం స్టోన్‌ అన్నారు.....

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం సుందర్‌రాజ్‌ వైపు అధిష్ఠానం చూపు! నల్లగొండ గ్రాడ్యుయేట్‌...

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే ప్రమాదం ఇప్ప‌టికే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.