జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల
పవన్ కల్యాణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ వైద్య, ప్రజారోగ్య రంగంలో ఉన్నతాధికారిగా పనిచేసిన గడల శ్రీనివాసరావు గతంలో రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన పరిపాలనా అంశాల్లో పనిచేశారు. 2026లో జనసేన పార్టీలో చేరిన ఆయనకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం కావడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక పరిణామంగా జనసేన రాష్ట్ర కార్యాలయం పేర్కొంది.

