epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!
భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం
రీ-సర్వేతో సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు
భూభారతితో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం: మంత్రి పొంగులేటి

కాకతీయ, హైదరాబాద్‌ : ప్రజలకు పారదర్శక రెవెన్యూ సేవలు అందించడంతోపాటు రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు దానిని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్‌ 14 నుంచి ఇప్పటివరకు 5,68,858 పాస్‌బుక్కులు జారీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు 6,71,508 పాస్‌బుక్కులు అందించామని, మొత్తంగా 34 నెలల్లో 12,40,366 పాస్‌బుక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు.

రీ-సర్వేతో హక్కుల కల్పన

దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ పథకాలకు దూరమైన రైతులను గుర్తించి, చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నామని పొంగులేటి తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం రీ-సర్వే నిర్వహించి వాస్తవ సాగుదారుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే ద్వారా గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూమిపై హక్కులు కల్పించినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. పాస్‌బుక్కుల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ముల్కాపల్లి మండలంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో రీ-సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. అక్కడి భూ సమస్యలను పరిష్కరించి త్వరలోనే హక్కుదారులకు పాస్‌బుక్కులు అందిస్తామని చెప్పారు. ఇదే విధానాన్ని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసి భూమిపై హక్కుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు మేలు జరిగేలా చర్యలు

ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలైనప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పొంగులేటి స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటుపైనా ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌.లోకేష్‌ కుమార్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌!

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌! జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం...

జూకు పోటెత్తిన సందర్శకులు

జూకు పోటెత్తిన సందర్శకులు ఒక్కరోజే 20,483 మంది సందర్శన రైళ్లు, సఫారీ సేవలకు అదనపు...

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు!

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు! నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ విశ్రాంత...

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి!

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి! అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళల...

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు...

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు! చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.