epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి
ప్రాణహిత నీటిని మళ్లించాలి!
నవంబర్‌లోగా నిర్మించకుంటే పంప్‌హౌస్‌ వద్ద ఆందోళన
నవంబర్‌ వరకు రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వాలి
రూ.25 కోట్లతో నెలన్నరలోనే నిర్మాణం పూర్తి చేయొచ్చు
మేడిగడ్డను బూచిగా చూపి రైతులకు అన్యాయం చేయొద్దు
ప్రశ్నించడమే కాదు.. పరిష్కార మార్గాలూ చూపిస్తున్నాం
తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొని రైతుల పంటలను కాపాడాలంటే కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేవలం రూ.25 కోట్లతో నెలన్నర రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయవచ్చని తెలిపారు. నవంబర్‌ నెలాఖరులోగా పనులు చేపట్టకపోతే కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మేడిగడ్డను సాకుగా చూపి రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన కవిత.. ప్రాణహిత నది ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనువైన ప్రాంతం, దాని నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కరువు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు నిపుణులతో చర్చించి, అధ్యయనం చేసిన తర్వాతే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చామని చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

నవంబర్‌ నెలాఖరులోగా నిర్మించాలి

ప్రాణహిత నదిలో కరువు పరిస్థితుల్లోనూ రోజుకు రెండు టీఎంసీల నీరు ప్రవహిస్తుంటుందని కవిత పేర్కొన్నారు. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే రైతులకు మేలు చేయవచ్చన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టి నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నవంబర్‌ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ సూచనలను నిపుణులతో పరిశీలించాలని, ప్రతిపాదనలో సాంకేతికంగా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కవిత తెలిపారు. తమ లక్ష్యం రాజకీయ ప్రయోజనం కాదని, రైతులకు నష్టం జరగకుండా చూడటమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రశ్నించడమే కాదు.. పరిష్కారమూ చూపిస్తాం

ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల తరఫున పోరాడటంతోపాటు సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడం కూడా తమ బాధ్యతేనని కవిత అన్నారు. రెండు రోజులు హడావుడి చేసి వెళ్లిపోవడం తమ ఉద్దేశం కాదని, కరువు నుంచి బయటపడేందుకు నిపుణులతో చర్చించిన తర్వాతే కాఫర్‌ డ్యామ్‌ ప్రతిపాదనను తెచ్చామని వివరించారు. రాష్ట్రంలో నవంబర్‌ వరకు రైతులకు నీళ్లు, కరెంటు అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలను కాపాడేందుకు ఉచిత విద్యుత్‌ సరఫరాను నవంబర్‌ వరకు కొనసాగించాలని తాము ముందుగానే కోరినట్లు గుర్తుచేశారు. తమ డిమాండ్‌ తర్వాతే ముఖ్యమంత్రి కేంద్రం నుంచి విద్యుత్‌ కోరుతామని ప్రకటించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు కోటి పది లక్షల ఎకరాల పంటలకు నీళ్లు, కరెంటు అవసరమని పేర్కొన్నారు. నవంబర్‌ చివరి వరకు సాగునీరు, విద్యుత్‌ అందించి పంటలను కాపాడాలని కోరారు. ప్రభుత్వం వద్ద నీళ్లు, కరెంటు అందించే అవకాశాలున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. ఈ విషయాన్ని రైతులకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ప్రశ్నించు.. పోరాడు.. పరిష్కరించు’ అనే నినాదంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.

తెలంగాణ వచ్చాకా నీటి న్యాయం జరగలేదు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు గడుస్తున్నా, రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా నీళ్లు మాకే’ అనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. గోదావరి, కృష్ణా నదుల జలాలను సమర్థంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంటూ, కృష్ణా పరివాహకంలో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలకు, గోదావరి పరివాహకంలో లక్ష ఎకరాలకు కొత్తగా నీటిని అందించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, పాత ఆయకట్టు స్థిరీకరణ, వరద ప్రవాహాన్ని వినియోగించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. కాళేశ్వరం కాలువలను పూర్తిచేయడానికి మరో రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని కవిత విమర్శించారు. రూ.26 వేల కోట్లు ఖర్చు చేసినా పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదని ఆరోపించారు. పాత బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతోందని, అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, దళితబంధు వంటి పథకాల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

మేడిగడ్డ పనులు కూడా పూర్తి చేయాలి

మేడిగడ్డ బ్యారేజీని బూచిగా చూపి రైతులకు అన్యాయం చేయవద్దని కవిత ప్రభుత్వాన్ని కోరారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ పనులను కూడా పూర్తి చేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 21 వేల చెరువులు ఎండిపోయాయని, దీంతో రైతులు, ముదిరాజ్‌లు, బెస్త సామాజిక వర్గాలకు చెందిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రానున్న పది నెలల్లో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కరువు తీవ్రత పెరిగే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కాఫర్‌ డ్యామ్‌ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించి, అవసరమైన సాంకేతిక పరీక్షల అనంతరం పనులు ప్రారంభించాలని కోరారు.

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలి

మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు విషయంలో ఎందుకు ముందడుగు పడటం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కారణంగా ముంపునకు గురైన బాధితులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటిని అందుబాటులో ఉన్న వనరుల నుంచి సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని కవిత స్పష్టం చేశారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై ప్రభుత్వం నవంబర్‌ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఆందోళన చేపడతామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు రియాజ్‌ అహ్మద్‌, ఇస్మాయిల్‌, నవీన్‌కుమార్‌, రవిచంద్ర, వెంకట్‌, నరేశ్‌ నేత తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దేశంలో నిశ్శబ్ద విప్లవం!

దేశంలో నిశ్శబ్ద విప్లవం! కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు రాహుల్‌ నాయకత్వం వైపు ప్రజల చూపు కష్టకాలంలో...

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు రేవంత్‌ భూదందాలపై సీబీఐ విచారణ జరిపించాలి! సీఎం...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..? నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి ఖర్చులో వెనుకబడిన...

గోదావరి జలాలపై కుట్ర..

గోదావరి జలాలపై కుట్ర.. తెలంగాణ హక్కులకు మరణశాసనం! గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి...

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా...

రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు! మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం సమానత్వం, స్వేచ్ఛ,...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ...

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.