epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ.. సిట్‌తో విచారణ జరపాలి!

జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ.. సిట్‌తో విచారణ జరపాలి!
రేవంత్‌ పాలనలో పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తున్నారు
ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా?
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బీఆర్‌ఎస్‌ నేత డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌

కాకతీయ, సిరిసిల్ల : జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై సిట్‌ ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేత డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులే గుండాలుగా వ్యవహరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బాధిత జర్నలిస్టులను పరామర్శించిన ఆయన, వారికి న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. గంభీరావుపేట మండలంలో భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకున్న అంశంపై ఏక్‌ ధమ్‌ న్యూస్‌ రిపోర్టర్లు కథనాలు ప్రచురించడంతో వారిపై అక్రమ కేసులు నమోదు చేశారని ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. గంభీరావుపేట ఎస్సై ఇద్దరు జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గాయాలతోపాటు చేయి విరిగి బాధితులు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు. జర్నలిస్టులు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నేరం చేయకపోయినా కేసులు నమోదు చేసి, ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్టులు చేసే పోలీసులు.. బాధితులుగా మారిన జర్నలిస్టులు ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక న్యాయమా?

సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయమా? ఇదేనా ప్రజాపాలన? అని ప్రవీణ్‌ కుమార్‌ నిలదీశారు. డీజీపీ సీవీ ఆనంద్‌ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు న్యాయస్థానాలు నిర్దేశించిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని పట్టించుకోకుండా జర్నలిస్టుల పట్ల కర్కశంగా వ్యవహరించారని విమర్శించారు. జర్నలిస్టులపై దాడి చేయాలని ఎస్సైకి ఎవరు ఆదేశాలిచ్చారో తేల్చాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలని, అవసరమైతే కేసును సీఐడీకి అప్పగించాలని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జర్నలిస్టులకు అండగా బీఆర్‌ఎస్‌

ఏక్‌ ధమ్‌ న్యూస్‌ రిపోర్టర్లు పదేళ్లుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్నారని ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌ ఫర్‌ న్యూస్‌పేపర్స్‌ ఫర్‌ ఇండియా గుర్తింపు పొందిన పత్రికకు చెందిన జర్నలిస్టులపై దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో పోలీసుల చేతిలో కర్ల రాజేశ్‌ హత్యకు గురయ్యారని, ఇప్పుడు సిరిసిల్లలో మరో దళిత జర్నలిస్టుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దాడిలో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజేశ్వరి దేవికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు

రాజేశ్వరి దేవికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు కాకతీయ, కరీంనగర్‌: శ్రీదేవి...

పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా దసరా వేడుకలు

పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా దసరా వేడుకలు ఆయుధ, జమ్మి, వాహన పూజల్లో పాల్గొన్న...

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం 475 జిలెటిన్‌ స్టిక్స్‌, 3,000 మీటర్ల డిటోనేటింగ్‌...

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి!

కోత దశలోనైనా నీటిని విడుదల చేయండి! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? ఎల్ఎండీ నుంచి సాగునీటి...

జోగాపూర్‌లో దొంగల చేతివాటం!

జోగాపూర్‌లో దొంగల చేతివాటం! అర్ధరాత్రి భారీ చోరీ.. రూ.80 వేల నగదు సహా...

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!

మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో...

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్

విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్ వేములవాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి మహా...

కరీంపేటలో దొంగల బీభత్సం..

కరీంపేటలో దొంగల బీభత్సం.. రైతుల మోటార్లు మాయం! ఒకే రాత్రి ముగ్గురు రైతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.