epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దేశంలో నిశ్శబ్ద విప్లవం!

దేశంలో నిశ్శబ్ద విప్లవం!
కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు
రాహుల్‌ నాయకత్వం వైపు ప్రజల చూపు
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి: మంత్రి ఉత్తమ్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతు దేశంలో రాజకీయ మార్పుపై ఉన్న ఆకాంక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం చార్మినార్‌ వద్ద నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం, రాజీవ్‌ సద్భావన పురస్కార ప్రదానోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు సమర్థ నాయకత్వం అందించారని ఉత్తమ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందని, బీజేపీని ఓడించి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతను బలోపేతం చేసే పోరాటంలో కార్యకర్తలు రాహుల్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తల సేవలకు గుర్తింపు ఇవ్వాలి

గత బీఆర్‌ఎస్‌ పాలనలో అనేక ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత గుర్తింపు ఇవ్వాలని ఉత్తమ్‌ సూచించారు. వారి పట్టుదల, త్యాగాలు, నిరంతర కృషి తెలంగాణలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పాల్గొనాలని, ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని అన్నారు. రాజీవ్‌గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర మతసామరస్యం, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ఎం. సావంత్‌ అన్నారు. సమాచార సాంకేతిక రంగం, పంచాయతీరాజ్‌, యువత సాధికారతలో రాజీవ్‌ కృషిని గుర్తుచేశారు. కంప్యూటరీకరణ ప్రాధాన్యాన్ని ముందుగానే గుర్తించారని, పంజాబ్‌, అసోం, మిజోరంలలో శాంతి పునరుద్ధరణకు కృషి చేశారని తెలిపారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు. కుల, మత విభజనలు దేశాన్ని బలహీనపరుస్తాయని సావంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేషాన్ని ఎదుర్కొని ప్రేమ, సామరస్యం, జాతీయ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు.

డాక్టర్‌ సి. మల్లికార్జునకు సత్కారం

సమాజానికి విశిష్ట సేవలందిస్తున్నందుకు హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సి. మల్లికార్జునను సత్కరించారు. 1990 నుంచి రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, రాజీవ్‌ సద్భావన పురస్కార కమిటీని ఉత్తమ్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ఎం. సావంత్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు అంజన్‌కుమార్‌యాదవ్‌, ఫిరోజ్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నాయకులు, రాజీవ్‌ సద్భావన పురస్కార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు రేవంత్‌ భూదందాలపై సీబీఐ విచారణ జరిపించాలి! సీఎం...

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి ప్రాణహిత నీటిని మళ్లించాలి! నవంబర్‌లోగా నిర్మించకుంటే పంప్‌హౌస్‌ వద్ద...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..? నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి ఖర్చులో వెనుకబడిన...

గోదావరి జలాలపై కుట్ర..

గోదావరి జలాలపై కుట్ర.. తెలంగాణ హక్కులకు మరణశాసనం! గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి...

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా...

రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు! మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం సమానత్వం, స్వేచ్ఛ,...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ...

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.