epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు
రేవంత్‌ భూదందాలపై సీబీఐ విచారణ జరిపించాలి!
సీఎం తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వెనుక ఎవరున్నారు?
తెలంగాణలో సీబీఐ విచారణకు సీఎం అనుమతి అవసరం
కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ డిమాండ్‌ చేశారు. కొంతకాలంగా ఆధారాలతో ప్రశ్నిస్తున్నా సీఎం స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులపై బురదజల్లుతూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. కొండల్‌రెడ్డి కంపెనీకి భూమి కేటాయించారని, అమెరికాలో రేవంత్‌రెడ్డి తమ్ముడికి చెందిన స్వచ్‌ బయో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని క్రిశాంక్‌ ఆరోపించారు. గీతా హ్యుందాయ్‌ షోరూమ్‌ల ప్రారంభోత్సవాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. రాష్ట్రంలో ఫార్మా, ఆరోగ్య, రక్షణ, విద్య, కార్ల కంపెనీలతో పాటు భూముల వ్యవహారాల్లోనూ ప్రభుత్వం వివాదాలకు తావిస్తోందని విమర్శించారు. రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి కుటుంబం రూ.50 వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

22ఏ పేరుతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లా?

నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన 22ఏ నిబంధన పేరుతో భూదందాలు జరుగుతున్నాయని క్రిశాంక్‌ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చందనవల్లిలోని సర్వే నంబరు 363లో ఉన్న లావణి పట్టా భూములకు సంబంధించి సర్వే నంబరు 363/3లోని నాలుగు ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అయినట్లు పేర్కొన్నారు. కోతా శ్రీకాంత్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ జరిగిందని, ఆర్‌9 కన్స్ట్రక్షన్స్‌ సంస్థ, మంచిరేవుల విల్లాలకు సంబంధించిన వ్యవహారాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్‌9 కన్స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి అని క్రిశాంక్‌ పేర్కొన్నారు. ఈ భూముల లావాదేవీలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా అన్నది అధికారికంగా తేల్చాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి మరో అధికార కేంద్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బెదిరించడంతోపాటు 22ఏ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సీబీఐ విచారణకు సీఎం అనుమతి ఇవ్వాలి

తెలంగాణలో సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని క్రిశాంక్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలపై ఆయనే విచారణకు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై విచారణ జరిపించడం లేదని విమర్శించారు. ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర విచారణ జరగాలని అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ చుట్టూ అసైన్డ్‌ భూములున్నాయంటూ గతంలో దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారాలపై ప్రశ్నలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌ల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ నాయకులు ఏం సాధించారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా అని నిలదీశారు.
ఎల్‌నినో ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో మంత్రులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని క్రిశాంక్‌ ఆరోపించారు. అక్టోబర్‌లో సమీక్ష నిర్వహించి రైతులు పంటలు వేయవద్దని చెబుతున్నారని విమర్శించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, రైతులపై ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోకి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నవారికి, రైతుల సమస్యలు ఎందుకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం

తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోయిందని, అయితే రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం పెరిగాయని క్రిశాంక్‌ ఆరోపించారు. సిరిసిల్లలో రూ.100 కోట్లతో సభ నిర్వహించి కేటీఆర్‌కు హోటళ్లు ఉన్నాయని ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇతరుల ఆస్తులపై ఆరోపణలు చేసే ముందు తనపై వస్తున్న ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, బాధితులే తమకు వివరాలు అందిస్తున్నారని క్రిశాంక్‌ తెలిపారు. సమాచారం ఎవరి నుంచి వచ్చినా, దానిని పత్రాలు, రికార్డుల ఆధారంగా పరిశీలించి నిజానిజాలు వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూముల లావాదేవీలు, కంపెనీలకు కేటాయింపులు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలకు సీఎం సమాధానం చెప్పాలని, అవసరమైన రికార్డులను ప్రజల ముందుంచాలని క్రిశాంక్‌ కోరారు. ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దేశంలో నిశ్శబ్ద విప్లవం!

దేశంలో నిశ్శబ్ద విప్లవం! కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు రాహుల్‌ నాయకత్వం వైపు ప్రజల చూపు కష్టకాలంలో...

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి ప్రాణహిత నీటిని మళ్లించాలి! నవంబర్‌లోగా నిర్మించకుంటే పంప్‌హౌస్‌ వద్ద...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..? నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి ఖర్చులో వెనుకబడిన...

గోదావరి జలాలపై కుట్ర..

గోదావరి జలాలపై కుట్ర.. తెలంగాణ హక్కులకు మరణశాసనం! గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి...

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా...

రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు! మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం సమానత్వం, స్వేచ్ఛ,...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ...

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.