epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల ప‌రిస్థితేంటి..?
నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి
ఖర్చులో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక సమీక్ష చేప‌ట్టాలి
ఆదాయ వనరుల సమీకరణకు కార్యాచరణ ప్రణాళిక
రుణాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాలి
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల సద్వినియోగం
ఆర్థిక నిర్వహణలో నిపుణుల సలహాలు తీసుకోవాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని, నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసేందుకు ఆదాయ వనరుల సమీకరణ, ఆర్థిక సంస్కరణలు, రుణాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క ఈ సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రగతి ఉప ప్రణాళిక అమలు, శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.

నిధుల ఖర్చులో వెనుకబడిన శాఖలపై దృష్టి

సాధారణ బడ్జెట్‌ కింద కేటాయించిన నిధులను వినియోగిస్తున్న తరహాలోనే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక బడ్జెట్‌ కింద కేటాయించిన నిధులను కూడా చట్టబద్ధ నిబంధనలు, బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వినియోగించాలని భట్టి విక్రమార్క సూచించారు. నిధుల ఖర్చులో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడ్జెట్‌ కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. ఖర్చులో వెనుకబడిన శాఖలతో ఆర్థికశాఖ అధికారులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని సూచించారు. నిధుల వినియోగంలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్న శాఖల కార్యదర్శులతో త్వరలో సమావేశాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రాధాన్య శాఖలతో ప్రారంభించి వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, పురపాలక పరిపాలన, పంచాయతీరాజ్‌, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష చేపట్టాలని సూచించారు. అనంతరం ఇతర శాఖల పనితీరును కూడా పరిశీలించాలని తెలిపారు. ప్రతి శాఖకు కేటాయించిన నిధులు, ఇప్పటివరకు చేసిన వ్యయం, మిగిలిన నిధులను సమర్థంగా వినియోగించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా నిధుల వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

ఆదాయ వనరుల సమీకరణకు ప్రణాళిక

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలను గుర్తించాలని భట్టి విక్రమార్క సూచించారు. వాస్తవ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ రూపకల్పన చేయాలని తెలిపారు. ఖర్చుల నియంత్రణ, నిధుల సమర్థ వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరుల లభ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ చేపడుతున్న సంస్కరణలు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే చర్యలు, రుణాల పునర్వ్యవస్థీకరణ వ్యూహాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాష్ట్రంలో స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు.

నిపుణుల సలహాలతో ఆర్థిక నిర్వహణ

ఆర్థిక నిర్వహణలో అనుభవజ్ఞులైన సలహాదారులు, ఆర్థిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాల అమలు మధ్య సమన్వయం ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. సంక్షేమ నిధులు అర్హులైన లబ్ధిదారులకు చేరడంతోపాటు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా చూడటం సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణలో కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఆర్థికశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దేశంలో నిశ్శబ్ద విప్లవం!

దేశంలో నిశ్శబ్ద విప్లవం! కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు రాహుల్‌ నాయకత్వం వైపు ప్రజల చూపు కష్టకాలంలో...

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు

22ఏ పేరుతో కొండ‌ల్ రెడ్డి భూదందాలు రేవంత్‌ భూదందాలపై సీబీఐ విచారణ జరిపించాలి! సీఎం...

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి

కన్నెపల్లిలో కాఫర్‌ డ్యామ్ క‌ట్టాలి ప్రాణహిత నీటిని మళ్లించాలి! నవంబర్‌లోగా నిర్మించకుంటే పంప్‌హౌస్‌ వద్ద...

గోదావరి జలాలపై కుట్ర..

గోదావరి జలాలపై కుట్ర.. తెలంగాణ హక్కులకు మరణశాసనం! గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి...

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డాక్టర్‌ గడల పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా...

రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు! మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం సమానత్వం, స్వేచ్ఛ,...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ...

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.