బాన్సువాడ దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి
కాకతీయ, బాన్సువాడ: విజయదశమి సందర్భంగా ఈ నెల 20న బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణ కాష్ఠ దహన కార్యక్రమ ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ డీఎస్పీ విఠల్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డితో కలిసి కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

