అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి
పెంచికలపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం
కాకతీయ, ఆత్మకూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఆయన ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెంచికలపేటలో బీఆర్ఎస్ నాయకులు ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. సమన్వయ సభ్యుడు కాంతాల కేశవరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జిల్లపెల్లి సుధాకర్, క్లస్టర్ ఇన్చార్జి మందపెల్లి మధుకర్ ఆధ్వర్యంలో పట్టభద్రులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ అర్హులందరూ నమోదు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మందపెల్లి మిరియా ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మందపెల్లి మమత-రవీందర్, మంగ సందీప్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

