epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డబ్బులొస్తలేవని కుంగిపోయాడు… ప్రాణాలు విడిచాడు!

డబ్బులొస్తలేవని కుంగిపోయాడు… ప్రాణాలు విడిచాడు!

– రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో తీవ్ర విషాదం
– అప్పు చెల్లించలేదని మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ముత్తయ్య మృతి
– మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

కాకతీయ,రాయపర్తి : అవసరానికి ఆదుకుంటే ఆపదలో ముంచాడు. కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే ఇష్టా రీతిన ప్రవర్తించాడు.చివరికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావనే మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో తిర్మమలాయపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ముద్ర బోయిన ముత్తయ్య(75)వద్ద అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్ ఆరేళ్ల క్రితం రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.కొంతకాలం తర్వాత ముత్తయ్యకు అత్యవసరమై డబ్బులు కావలసి వచ్చి,తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రసాద్ ను కోరాడు.ఈ క్రమంలో ప్రసాద్ డబ్బులు చెల్లించకుండా రోజులు తిప్పుతూ కాలయాపన చేయడం మొదలుపెట్టాడని అన్నారు.పలుమార్లు బ్రతిమలాడిన,నిలదీసినా ప్రసాద్ నుంచి సరైన సమాధానం రాలేదు.దింతో తను ఎంతో నమ్మకంతో ఇచ్చిన రూ. 2లక్షల అప్పు ఇక తిరిగి ఆదేమోనని ముత్తయ్య తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని పేర్కొన్నారు.కూడబెట్టిన సొమ్ము చేజారిపోయిందని బాధ,ఆర్థిక ఇబ్బందులు ఆయనను లోలోపల కొంగదీశాయి.ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడితో ముత్తయ్యకు వారం రోజుల క్రితం బీపి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ముత్తయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అదే రోజు రాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు,బంధువులు గ్రామానికి తరలించి బాధ్యుడైన ప్రసాద్ ఇంటి ఎదుట ముత్తయ్య మృతదేహంతో నిరసన చేపట్టారు.తన తండ్రి మరణానికి ప్రసాద్ మోసమే కారణమని కుమారుడు నర్సయ్య ఆరోపించాడు.డబ్బులు ఎగ్గొట్టి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేయాలని,తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆందోళన చేపట్టారు.ఈ నిరసనతో గ్రామంలో తీవ్ర ఉత్రిక వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, బాధితులతో మాట్లాడి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌ వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ! వంద‌ల కోట్ల...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.