epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం

అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం
పేద విద్యార్థులకు ఆకలి తీర్చ‌డం గొప్ప విష‌యం
ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యం ప్రశంసనీయం
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
ఎనుమాముల అక్షయ పాత్ర సెంట్రల్ హబ్‌లో అధునాతన యంత్రాల ప్రారంభం

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పేద విద్యార్థుల ఆకలి తీర్చి, వారికి చదువుపై దృష్టి నిలబెట్టేలా చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమ‌ని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. వరంగల్ నగర పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతంలో ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో సీఏస్ఆర్ నిధులతో, హెచ్‌డిబి సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన వంటశాల యంత్రాలను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌కు ఉన్న గుర్తింపు, పేరు ప్రతిష్ఠలు విశేషమని పేర్కొన్నారు. కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఏర్పడిన ఈ సంస్థ ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవల రంగంలోనూ విశేషంగా పని చేస్తోందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్‌కు అనుబంధ సంస్థగా బెంగళూరు కేంద్రంగా ప్రారంభమై, “ఆకలి కారణంగా ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదు” అనే ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం)లో భాగంగా నాణ్యమైన, రుచికరమైన, వేడి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అక్షయ పాత్ర పనిచేస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న సంస్థ ఇదేనని మంత్రి తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ 20 లక్షలకుపైగా విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సేవతో పాటు విలువల బోధన

అవసరార్థులకు భోజనం అందించడమే కాకుండా, పిల్లల్లో కృష్ణ భక్తి, సత్ప్రవర్తన, మానవీయ విలువలు నాటేందుకు అక్షయ పాత్ర కృషి చేస్తోందన్నారు. “హరే రామ, హరే కృష్ణ” అనే నామస్మరణ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని, విదేశీయులు సైతం భారత్‌కు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో ఆధునిక కిచెన్ యంత్రాల ఏర్పాటుకు సహకరించిన హెచ్‌డిబి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లో కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.