epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం
మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి తీవ్ర గాయాలు
డ్రగ్స్ తీసుకుని తోటి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి
తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స
హాస్టల్‌లో భద్రత లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం
“ఇది కామన్ విషయం” అంటూ యాజమాన్యం నిర్లక్ష్య స్పందన
ఘటన వీడియో వెలుగులోకి… మరిన్ని అనుమానాలు
అధికారుల విచారణ, కఠిన చర్యల కోసం తల్లిదండ్రుల డిమాండ్

కాకతీయ, ఖమ్మం బ్యూరో : సొంత గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తోటి విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో మామిడాల విశాల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని మత్తులో విచక్షణ కోల్పోయి విశాల్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర విద్యార్థులపై కూడా దాడికి పాల్పడటంతో హాస్టల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్‌లో భద్రత గాలికి… వీడియోతో వెలుగులోకి ఘటన

దాడి జరిగిన సమయంలో హాస్టల్‌లో వార్డెన్, వాచ్‌మెన్, భద్రతా సిబ్బంది లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను మరో విద్యార్థి రహస్యంగా వీడియో తీసినట్లు సమాచారం. వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులకు “ఇది కామన్ విషయమే… చిన్న విషయాన్ని పెద్దగా చేయొద్దు” అంటూ నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపిస్తున్నారు. గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులను పరీక్షల హాల్ టికెట్ విషయంలో బెదిరించినట్లు కూడా సమాచారం. మీడియా ప్రతినిధులు సమాచారం కోసం కళాశాలకు వెళ్లినప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది.

విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హాస్టళ్లలో డ్రగ్స్ వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.