epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తాం
క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు
స్టేడియాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం
యువతకు శిక్షణ, ప్రోత్సాహం అందించాలి
క్రీడలతో ఆరోగ్యం.. క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కాక‌తీయ‌, హనుమకొండ : వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌, ఇండియా యూత్‌ అండర్‌-18 సెలెక్షన్‌ ట్రయల్‌ క్యాంప్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్టేడియాన్ని కేవలం క్రీడా మైదానంగా కాకుండా అన్ని సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్‌ హబ్‌గా అభివృద్ధి చేసేలా సమగ్ర రూపకల్పనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించాలి
క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి శిక్షణ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నత స్థాయికి ఎదిగేలా కింది స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు.
విద్య, వైద్యం తర్వాత క్రీడలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, యువత క్రీడలను భవిష్యత్తుకు బలమైన పునాదిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు కే.ఆర్‌.నాగరాజు, నగర పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ ఖాన్‌, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల...

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి...

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్...

శ్మ‌శాన వాటికకు దారేది?

శ్మ‌శాన వాటికకు దారేది? కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి...

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ఇంట్లో తనిఖీలు.. 50 క్వింటాళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.