న్యాయవాదులపై దాడులను అరికట్టాలి
శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య
కాకతీయ, చేర్యాల : న్యాయవాది గూడెపు శ్రీధర్‌పై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చేర్యాల బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నాగపురి గ్రామంలోని శ్రీధర్ ఇంటిపై దాడి చేసి, కారు అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు ఆస్తి నష్టం కలిగించి, చంపుతామని బెదిరించిన ఘటనను తీవ్రంగా ఖండించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని, న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరింది. దాడికి నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆరేళ్ల వీరమల్లయ్య మాట్లాడుతూ.. న్యాయవాది శ్రీధర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్, సీనియర్ న్యాయవాది భూమిగారి మనోహర్, పొన్నం సురేష్, నల్గొండ సంతోష్, తాటికొండ ప్రణీత్, గుస్క వెంకటేష్, పర్వతం రాములు, మోకు రాజిరెడ్డి, నీరటి రాజలింగం, దర్శనం ప్రశాంత్, అంకణి సురేందర్, బైరగోని ప్రసాద్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

