అరెస్టు చేస్తే కానీ సభలు నిర్వహించలేరా
* సీఎం సభకు వెళ్లకుండా అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు!
* హామీల అమలులో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
* పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నమా?
* చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకుంటే పాతారెస్తాం
* కాంగ్రెస్ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకుల తీవ్ర ఆగ్రహం
కాకతీయ,చేర్యాల: సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే సభ నేపథ్యంలో చేర్యాల మండలానికి చెందిన అఖిలపక్ష పార్టీల నాయకులను చేర్యాల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం సభకు వెళ్లకుండా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నాయకులు మండిపడ్డారు.చేర్యాల రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హామీని విస్మరించాలని ఫైర్ అయ్యారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకుంటే కాంగ్రెస్ పార్టీని పాతారెస్తామని హెచ్చరించారు.ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నాయకులను అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో ఆపలేరు.. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.అరెస్ట్ అయిన వారిలో సిద్దిపేట జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ముస్ట్యాల బాల్ నర్సయ్య, బీజేపీ రాష్ట్ర నేత బూరుగు సురేష్ గౌడ్,వెంకట్ మహో,గుర్జకుంట సర్పంచ్ కాశెట్టి పాండు, మంచాల కొండయ్య, బండకింది అరుణ్ గౌడ్,బెజ్జరబోయిన వెంకట్, యండి పాషా,రంజిత్,ఇన్నారెడ్డి,బో యిని మల్లేశం,తో పాటు తదితరులు ఉన్నారు.

