పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి
పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్….
కాకతీయ,నర్సంపేట టౌన్:- పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నర్సంపేట కాంగ్రెస్ కోఆర్డినేటర్ పబ్బతి సతీష్‌రెడ్డి, ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మెట్టు రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం బాధ్యులకు సూచించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి మద్దతుగా నిలిచి, ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు. పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు.


