సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే
పట్టభద్రుల ఆశయాలను మండలిలో బలంగా వినిపించాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా
కాకతీయ, హైదరాబాద్ : నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో సర్వోత్తమరెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత, పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలతో ఉన్న అనుబంధం సర్వోత్తమరెడ్డికి కలిసొస్తాయని పేర్కొన్నారు. పట్టభద్రుల ఆశయాలను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఏఐసీసీ, టీపీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న సర్వోత్తమరెడ్డి పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

