epaper
Friday, October 9, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ తిమ్మాపురం సబ్‌స్టేషన్‌ వద్ద బీజేపీ కిసాన్‌ మోర్చా ధర్నా

పోలీసుల అడ్డగింత

పలువురు నాయకుల అరెస్ట్‌ 

కాకతీయ,నర్సంపేట టౌన్:-రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ విమర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం హైవేపై ఉన్న తిమ్మాపురం సబ్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతిరెడ్డి నేతృత్వంలో, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు దండు కిషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పలువురు బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం నరసయ్య, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌ తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంటు కోతలతో పంటలకు నష్టం

గతంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందేదని, ప్రస్తుతం సరైన సమయంలో విద్యుత్‌ సరఫరా లేక వరి, పత్తి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని నాయకులు ఆరోపించారు. కరెంటు కోతల కారణంగా రైతులు రాత్రివేళల్లో పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. పాములు, తేళ్ల భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలు, విద్యుత్‌ కోతలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు.

పోలీసుల అడ్డగింత

సబ్‌స్టేషన్‌ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, మాజీ మేయర్‌ డాక్టర్‌ టి. రాజేశ్వరరావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడమట జగన్మోహన్‌రెడ్డి, దేవర శీను, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతనకంటి శ్రీనివాస్‌రెడ్డి, గంగారెడ్డి, యాదగిరిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్‌, జలగం రంజిత్‌రావు, సిద్ధం నరేష్‌, ముత్తిరెడ్డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం

పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య...

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి

మిల్క్‌ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి కాకతీయ, వరంగల్‌ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు...

రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు టెన్నిస్‌, గట్కా పోటీలకు ఐదుగురి ఎంపిక ఉమ్మడి వరంగల్‌...

తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి కాకతీయ, నెల్లికుదురు: ప్రాథమికోన్నత పాఠశాల...

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు..

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు...

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్.... కాకతీయ,నర్సంపేట టౌన్:-...

ధైర్యంగా ఉండు..నేనున్నా!

ధైర్యంగా ఉండు..నేనున్నా! అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఎర్రబెల్లి అభయం కాకతీయ,రాయపర్తి : ఏమి అధైర్య...

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా

కొత్త రేషన్‌ కార్డులతో పేదలకు భరోసా పేదవాడి ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప‌ర‌కాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.