మచ్చాపూరంలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ఓవర్లోడ్ సమస్యకు పరిష్కారం
100 కేవీఏకు అదనంగా మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
సర్పంచ్ మానస ప్రకాష్ చొరవతో విద్యుత్ శాఖ చర్యలు
కాకతీయ, గీసుగొండ: మచ్చాపూరంలో విద్యుత్ సరఫరా సమస్యలను తగ్గించి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్పై అధిక భారం పడుతుండటంతో ఓవర్లోడ్ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మచ్చాపూర్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని ఎస్ఎస్-16 వద్ద ఇప్పటికే ఉన్న 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్కు అదనంగా మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ఛార్జింగ్ చేశారు. అదనపు ట్రాన్స్ఫార్మర్తో ఓవర్లోడ్ సమస్య తగ్గి విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. సాగు అవసరాలకు విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవడం రైతులకు ప్రయోజనకరమని తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సర్పంచ్ మానస ప్రకాష్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ బి. రవి, ఏఈ ఆర్. సందీప్ కుమార్, సర్పంచ్ మానస ప్రకాష్, రైతులు బొల్లి ప్రభాకర్, మర్రి కుమార్, సంగనేని కృష్ణ, నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

