epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ రాస్తారోకో

విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ రాస్తారోకో
రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి
కోతలతో ఎండిపోతున్న పంటలు
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన

కాకతీయ, పెద్దవంగర: వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం కనీసం 5 నుంచి 6 గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, పొలాల్లో భూమి బీటలు వారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్‌ నాయకులు రామచంద్రయ్య శర్మ, సుధీర్‌, సంజయ్‌, భాస్కర్‌, సుధాకర్‌, వెంకన్న, పటేల్‌ నాయక్‌, కవిత యాకన్న, రాము, వెంకట్‌రెడ్డి, శంకర్‌, యాకన్న, రవి, సమ్మయ్య, పూర్ణచందర్‌, గంగాధర్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా!

ములుగు మత్తులో.. సిండికేట్‌ సత్తా! జిల్లాలో 2,700ల‌కు పైగా బెల్ట్‌ షాపులు ప్ర‌తీ గ్రామంలో...

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

20న‌ ట్రైసిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు మ‌ధ్యాహ్నం 3 నుంచి 21న తెల్లవారుజామున 3...

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా

జనగామలో బతుకమ్మ వేడుకల్లో ఎర్రబెల్లి, పల్లా కాకతీయ, జనగామ : తెలంగాణ సంస్కృతి,...

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తి ఆరోగ్యంపై అవగాహనకు హాఫ్‌ మారథాన్‌లు దోహదం కాంగ్రెస్‌ సీనియర్‌...

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి

భూ ప‌రిహారం ముందే చెల్లించాలి పంటలు ధ్వంసం చేయడాన్ని ఆపాలి ఖరీఫ్‌ కోతలు పూర్తయ్యే...

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి

వరంగల్‌ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి ప్రతిపాదనలను పరిశీలించి ముందుకు...

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు.. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై...

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా 5 రోజుల సెలవు కాకతీయ కేసముద్రం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.