యువతలో ఫిట్నెస్పై పెరుగుతున్న ఆసక్తి
ఆరోగ్యంపై అవగాహనకు హాఫ్ మారథాన్లు దోహదం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల
కాకతీయ, హనుమకొండ : హాఫ్ మారథాన్లు ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణపై అవగాహన పెంచడంతోపాటు యువతను క్రీడలు, ఫిట్నెస్ వైపు ప్రోత్సహిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. హనుమకొండలో శనివారం నాయిని విశాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్లో ప్రజలు, యువత, అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా రాజేందర్రెడ్డి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం పెంచుకోవాలని, ప్రతిరోజూ నడక, పరుగు అలవాటు చేసుకోవాలని డాక్టర్ రామకృష్ణ సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వోడితల రామ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

