మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల, లింగంపేట గ్రామాల్లో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆయా గ్రామాల్లోని అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొదట మల్యాల గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చల్మెడ.. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత లింగంపేట గ్రామంలో నిర్వహించిన కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ.. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, సర్పంచులు మందల అబ్రహం, కొక్కుల నరేష్, నాయకులు డప్పుల అశోక్, బైరవని రమేష్, దుమ్ము ఆనంద్, బత్తుల కమలాకర్, పోతురాజు తిరుపతి, ఆకుల ఎల్లయ్య, గట్టు లక్ష్మీనారాయణ, అన్నం శ్రీధర్, గాజుల సత్తయ్య, గుడిసె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

