epaper
Tuesday, October 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల జీతాలు పెంచాల్సిందే!

కార్మికుల జీతాలు పెంచాల్సిందే!
సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే
కాంగ్రెస్‌ పాలనలో మూడేళ్లుగా జీతాల పెంపు లేదు
అసెంబ్లీలో కార్మికుల పక్షాన పోరాడతా: మాజీ మంత్రి హరీశ్‌రావు

కాకతీయ, సిద్దిపేట : పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేటకు జాతీయ స్థాయిలో స్వచ్ఛత అవార్డులు రావడం తన గొప్పతనం కాదని, చలి, వానను లెక్కచేయకుండా శ్రమించిన పారిశుధ్య కార్మికుల కష్టానికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో కార్మికులతో కలిసి టిఫిన్‌ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దసరా సందర్భంగా తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్లు, షర్టులను అందజేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు నుంచి ఆరు నెలల వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేదని హరీశ్‌రావు అన్నారు. నాడు రూ.8,300గా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల జీతాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విడతలవారీగా రూ.12 వేలు, రూ.14 వేలు, చివరకు రూ.16,600కు పెంచామని వివరించారు. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి ఏడుగురు కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా ఖాతాల్లో జీతాలు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విమర్శించారు. మరోవైపు నిత్యావసరాలు, విద్యుత్‌ బిల్లులు, ఇళ్ల అద్దెలు, బస్సు చార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. వంటనూనె, పప్పులు, ఉల్లిగడ్డలు, బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయని అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో కార్మికులు వేతనాల పెంపు కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు.

కార్మికుల శ్రమ తగ్గించేందుకు చర్యలు

సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, స్వీపింగ్‌ యంత్రాల ఏర్పాటు, చెత్తకుండీల తొలగింపు, ఇంటింటికీ చెత్త సేకరణ ఆటోల నిర్వహణతో పారిశుధ్య కార్మికుల శ్రమను తగ్గించామని హరీశ్‌రావు తెలిపారు. గతంలో మురుగు కాలువల్లోకి దిగి చెత్తను తొలగించాల్సి వచ్చేదని, భూగర్భ డ్రైనేజీతో ఆ ఇబ్బందులు తగ్గాయని చెప్పారు. చెత్తకుండీల చుట్టూ పందులు, కుక్కల వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రీసైక్లింగ్‌ ద్వారా కార్మికులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలను కూడా కల్పించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్నసాగర్‌ ద్వారా సిద్దిపేటకు నీరు అందుబాటులోకి రావడంతో నల్లా ఆపరేటర్లకు గతంలో ఎదురైన రాత్రింబవళ్ల కష్టాలు తగ్గాయని చెప్పారు. గతంలో విద్యుత్‌ సరఫరా అంతరాయాల వల్ల అర్ధరాత్రి, తెల్లవారుజామున నీటి సరఫరా చేయాల్సి వచ్చేదని గుర్తుచేశారు.

ఇతర కార్మికులకూ గ్రూపు విధానం

పారిశుధ్య కార్మికులతోపాటు నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులకూ గ్రూపు విధానాన్ని వర్తింపజేసి నేరుగా జీతాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బ్యాంకు ఖాతాల సమస్యలను మున్సిపల్‌ అధికారులు, చైర్మన్‌ సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని కోరారు.
కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనా పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి కార్మికుల వేతనాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని, న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం కడవేరుగు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్...

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం

గురుకులంలో ఘనంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం * హర్యానా సంస్కృతి,...

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు

కరెంట్ కోతలతో కరిగిపోతున్న రైతు ఆశలు * ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో...

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన..

రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన.. * మోదీ దిష్టిబొమ్మ దహనం *...

గ్రామ అభివృద్దే ద్యేయం

గ్రామ అభివృద్దే ద్యేయం * సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య * ప్రజల నీటి అవసరాలకు...

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి

విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించాలి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి...

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి

న్యాయవాదులపై దాడులను అరికట్టాలి శ్రీధర్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి చేర్యాల...

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం

భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.