యూత్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్!
బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్ విమర్శ
కాకతీయ, ఆత్మకూరు : ఎన్నికల సమయంలో తెలంగాణ యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్ విమర్శించారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఎన్. జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ మేరకు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. యువతపై చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువతను ఏకం చేసి బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సాంబరాజు మహేష్, గట్టు వేణుగౌడ్, ఇర్సండ్ల సదానందం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

