పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి!
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించిన నేతలు
కాకతీయ, హన్మకొండ: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. నయీంనగర్‌లోని రాప్టర్ కోచింగ్ అకాడమీని సందర్శించి, అక్కడ విద్యనభ్యసిస్తున్న గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల భాగస్వామ్యం కీలకమన్నారు. ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే బాధ్యత కూడా అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో చైతన్యవంతంగా ఓటు వేయాలని కోరారు. తమ ఓటు ద్వారా పట్టభద్రులు గొంతు వినిపించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కూడాచైర్మన్ యాదవ్రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్, మాజీ కార్పొరేటర్లు గణేష్, యాదగిరి, సీనియర్ నాయకులు గోవింద్‌నాయక్, రమేష్‌బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

