ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!
* ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.. సమస్యలపై స్పందించిన అధికారులు
* సర్వసభ్య సమావేశంలో బయటి వ్యక్తుల హల్చల్!
* గంట తర్వాత గుర్తించిన అధికారులు.. సమావేశం నుంచి బయటకు పంపివేత
కాకతీయ,చేర్యాల:
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ రైతు వేదికలో శనివారం చేర్యాల ఎంపీడీవో ప్రణయ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ప్రజాప్రతినిధులు, సమావేశంలో పాల్గొన్న వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లేవనెత్తిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు స్పందిస్తూ, సమస్యల వివరాలను తెలుసుకుని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం చాటిచెప్పింది.ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్చావేదికగా నిలిచిన ఈ సమావేశం గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు
*సర్వసభ్య సమావేశంలో బయటి వ్యక్తుల హల్చల్!*
*గంట తర్వాత గుర్తించిన అధికారులు.. సమావేశం నుంచి బయటకు పంపివేత*
ముస్త్యాల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కడవేర్గు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో పాటు పలువురు వ్యక్తులు కూడా సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ జరుగుతున్న సమయంలో సదరు వ్యక్తులు అధికారులను ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశంలో బయటి గ్రామానికి చెందిన వ్యక్తులు అధికారులను ప్రశ్నించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
*గంట తర్వాత గుర్తించిన అధికారులు.. బయటకు పంపించిన వైనం!*
రైతు వేదికలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.కడవేర్గు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమావేశానికి హాజరై అధికారులను ప్రశ్నించారు. అయితే, సుమారు గంట తర్వాత ఈ విషయాన్ని గమనించిన అధికారులు సదరు వ్యక్తిని సమావేశం నుంచి బయటకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

