ఏక్తా దివస్ 5కే, 10కే రన్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు..
కాకతీయ, హనుమకొండ :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) సందర్భంగా హనుమకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 10కే రన్లో వరంగల్ వెస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రన్లో నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన 100 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమ వేముల, ఎం. అర్చన పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ ఐక్యతా భావాన్ని చాటుతూ కార్యక్రమంలో భాగస్వాములు కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోలి శ్రీలత హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

