epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐపీఎల్‌–2026లో ముస్తఫిజుర్‌కు బ్రేక్‌

ఐపీఎల్‌–2026లో ముస్తఫిజుర్‌కు బ్రేక్‌
విడుదల చేయాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు
భార‌త్‌-బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో నిర్ణ‌యం
కేకేఆర్‌ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
రూ.9.20 కోట్ల పెట్టుబడికి గండి
డెత్‌ ఓవర్ల బౌలింగ్‌కు ఏర్ప‌డ‌నున్న లోటు

కాకతీయ, క్రీడా ప్రతినిధి : భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌–2026పై కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ అధికారికంగా ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు. ఇప్పటివరకు ‘వేచి చూద్దాం’ అన్న విధానాన్ని అనుసరించిన బీసీసీఐ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అంతర్గత అశాంతి, దాని ప్రభావంగా భారత్‌లో ఏర్పడిన రాజకీయ, ప్రజా ఒత్తిడులే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. క్రీడలు–రాజకీయాల మధ్య ఉన్న సున్నిత సంబంధాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపుతోందని క్రికెట్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కేకేఆర్‌ రూ.9.20 కోట్ల భారీ ధరకు ముస్తఫిజుర్‌ను కొనుగోలు చేయడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్‌ ఆటగాడిగా ముస్తఫిజుర్‌ రికార్డు నెలకొల్పాడు. అయితే తాజా పరిణామాలతో ఆ పెట్టుబడి ఇప్పుడు జట్టుకు భారంగా మారింది. ఈ విషయంపై దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ “ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేకేఆర్‌ జట్టు నుంచి బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ సూచించింది. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునేందుకు అనుమతి ఇస్తాం” అని స్పష్టం చేశారు.

కేకేఆర్‌ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ

ముస్తఫిజుర్‌ నిష్క్రమణ కేకేఆర్‌కు వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా అతడిపైనే జట్టు ప్రధానంగా ఆధారపడింది. ఎడెన్‌ గార్డెన్స్‌ మెల్లని పిచ్‌కు సరిపోయే అతడి కట్టర్లు, ఎడమచేతి పేస్‌ యాంగిల్‌ను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఇప్పుడు చివరి ఓవర్ల బాధ్యత మొత్తం మతీష పతిరానాపైనే పడనుంది. ముస్తఫిజుర్‌ లేకపోవడంతో కేకేఆర్‌ ఓవర్సీస్‌ కాంబినేషన్‌ పూర్తిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీల్‌ నరైన్‌, కామెరూన్‌ గ్రీన్‌, పతిరానా చుట్టూ రూపొందించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయి. హర్షిత్‌ రాణా, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి భారత పేసర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావచ్చు. లేదంటే రాచిన్‌ రవీంద్ర లాంటి విదేశీ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఆర్థికంగా కూడా చిక్కులే

ఆర్థికంగా చూస్తే కేకేఆర్‌కు పరిస్థితి మరింత క్లిష్టం. ముస్తఫిజుర్‌ కోసం వెచ్చించిన రూ.9.20 కోట్లను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తిరిగి పర్స్‌లో జమ చేస్తేనే నాణ్యమైన ప్రత్యామ్నాయాన్ని దక్కించుకునే వీలుంటుంది. ఆ మొత్తంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం కేకేఆర్‌ ఆందోళనను మరింత పెంచుతోంది. ఐపీఎల్‌–2026 ప్రారంభానికి ముందే ఈ పరిణామం లీగ్‌పై, ముఖ్యంగా కేకేఆర్‌ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.