epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన
భక్తుడికి గాయాలు… ఆసుపత్రికి తరలింపు
విషయం బయటకు రాకుండా మంత్రాంగం?

కాకతీయ, మేడారం : మేడారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ నేమ్‌బోర్డు ఒక్కసారిగా కిందపడటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడు గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని జాతరలో చర్చ సాగుతోంది. జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే ప్రధాన రహదారిలోని హరిత వై–జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భయాందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలిన ఘటనపై అధికారుల మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు, విషయం బయటకు పోకుండా ఉంచేందుకు తంటాలు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే వీడియోలు తీయవద్దంటూ మీడియాను కాంట్రాక్టర్లు అభ్యర్థించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతర నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికార యంత్రాంగం మంత్రాంగం నడుపుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

భక్తుడికి గాయాలు… పోలీసుల తీరుపై ఆగ్రహం
ఈ ఘటనలో గాయపడిన ఎడ్ల నర్సయ్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైటింగ్ హోర్డింగ్ కుప్పకూలడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. హోర్డింగ్ కింద ఇరుక్కున్న తనను అక్కడే ఉన్న పోలీసులు కాపాడలేదని, తన భార్య ఎంత బ్రతిమలాడినా వారు కనికరం చూపలేదని వాపోయారు. తనను బయటకు తీసేందుకు పోలీసులు కాకుండా, అక్కడున్న సుమారు 20 మంది భక్తులే ముందుకొచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. లైటింగ్ నేమ్‌బోర్డులు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అవి ప్రైవేట్‌వైతే భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని, భక్తుల ప్రాణాలకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు భక్తుల భద్రత కోసమే జాతరలో ఉంటారా? లేక కేవలం విధులకు పరిమితమా? అంటూ క్షతగాత్రుడు ప్రశ్నించారు. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.