epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు
గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం
జాతర ముసుగులో అక్రమ అమ్మకాల జోరు
అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ
నర్సంపేటలో బట్టబయలైన నిర్లక్ష్యం

కాకతీయ, నర్సంపేట : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అనాదిగా తెల్ల బెల్లం (బంగారం)ను మొక్కులుగా సమర్పించే ఆచారం కొనసాగుతోంది. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దేవుడి పేరుతో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా విక్రయిస్తూ అదనపు ఆదాయానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం నల్ల బెల్లాన్ని నిషేధించినప్పటికీ, గుడుంబా తయారీ దారులు తెల్ల బెల్లంతోనే మద్యం తయారుచేస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు ‘దేవుడి పేరిట అమ్మకం’ అంటూ పట్టపగలే బెల్లం స్పటికాన్ని విక్రయిస్తున్నాయని తెలుస్తోంది. దీనిపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల మాటలు.. నీటిమీద రాతలు..
అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం తప్ప, క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉందని, మాటలకే పరిమితమై చేతల్లో చర్యలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పర్యవేక్షణ పూర్తిగా నీరుకారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సంపేట పట్టణంలో బెల్లం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండటం అధికారుల పనితీరుపై పెద్ద ప్రశ్నలు లేపుతోంది. షాపు యాజమాన్యాలు–అధికారుల మధ్య ఏవైనా అఘోర ఒప్పందాలు జరిగాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘బంగారం’ పేరిట గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాల విక్రయం జోరుగా సాగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

బెల్లం అమ్మకాల్లో నర్సంపేట టాప్!

సమ్మక్క–సారలమ్మ జాతర ముసుగులో పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు అధిక మొత్తంలో గుడుంబా తయారీకి అవసరమైన పదార్థాలు విక్రయిస్తూ నర్సంపేటను టాప్‌లో నిలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెక్కర, ఈస్ట్ ఫౌండ్రీల నుంచి వచ్చే పట్టికలు కూడా బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. జాతర ముసుగులో అక్రమంగా బెల్లం పట్టపగలే విక్రయిస్తున్న దుకాణాలను నియంత్రించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం రోజువారీ పర్యవేక్షణ కూడా భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.