epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెన్నుపోటు రాజకీయాలు సహించబోము-మంత్రి సీతక్క

వెన్నుపోటు రాజకీయాలు సహించబోము-మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని కాంగ్రెస్ కౌన్సిలర్లను అభినందించారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చైర్‌పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ బిక్షపతిని ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ చైర్‌పర్సన్ కావాలనే ఆశ ఉంటుందని, కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడిగా, ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న బిక్షపతికి అనుభవం దృష్ట్యా ఈ అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్నో ఒత్తిడులు వచ్చినప్పటికీ పార్టీ మారకుండా నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు బిక్షపతి అని అన్నారు. అవకాశం రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మంచి అవకాశాలు అందరికీ వస్తాయని మంత్రి భరోసా ఇచ్చారు. తనకు ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు—అందరూ సమానమని స్పష్టం చేశారు. ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని ఇది చివరి హెచ్చరిక అని అన్నారు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్‌ను అన్నలాంటివారని పేర్కొంటూ, ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయని తెలిపారు. తమను ఓడించేందుకు రియల్ ఎస్టేట్ వర్గాలు భారీగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని మంత్రి సీతక్క అన్నారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం ఖాయమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.