epaper
Wednesday, September 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ ఆదేశం

కాకతీయ, నెల్లికుదురు: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ ఆదేశించారు. బుధవారం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, షెడ్యూల్‌ ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాసంస్థల్లో వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టీకాలు సకాలంలో వేయాలని సూచించారు. మందుల నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని, బోదకాలు, గర్భాశయ క్యాన్సర్‌ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ ప్రతి సబ్జెక్టుపై పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ నుంచే భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించాలని, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి మదర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవి రాథోడ్‌, తహసీల్దార్‌ నరేష్‌, ఎంపీడీవో కుమార్‌, ప్రిన్సిపల్‌ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా...

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే మండల కమిటీ ఎన్నిక కాకతీయ, నెల్లికుదురు : టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల...

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు

లెంకపల్లి సర్పంచ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన హరీశ్‌రావు కాకతీయ, నర్సంపేట: ఇటీవల రోడ్డు...

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ప్రశ్నపత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: ప్రశ్నపత్రాల బాహ్య...

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు కాంగ్రెస్ హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారు నా పనితీరే...

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని...

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి పెండింగ్‌ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి మాజీ...

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.