epaper
Tuesday, October 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కాంక్రీట్‌తో రాజన్న గుడి నిర్మాణమా?

కృష్ణశిలతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయాన్ని నిర్మించాలి

రైతులకు నవంబర్‌ వరకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే

సిరిసిల్ల సెస్‌లో రూ.32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి

కాళేశ్వరంతో సిరిసిల్ల, వేములవాడకు ఒరిగిందేమీ లేదు

నేరెళ్ల బాధితులకు కోటి పరిహారం, 3 ఎకరాల భూమి, ఉద్యోగం ఇవ్వాలి

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో/ వేములవాడ : ఎములాడ రాజన్న ఆలయాన్ని కాంక్రీట్‌తో నిర్మిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న ఆలయాన్ని కృష్ణశిలతో ఆగమ శాస్త్రం, ఆచారాల ప్రకారం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఆలయ నిర్మాణం ఆలస్యమైనా ఫర్వాలేదని, వెయ్యేళ్లు నిలిచేలా కృష్ణశిలతో నిర్మించాలన్నారు. రాజన్న ఆలయానికి నిధుల విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా నీటిపారుదల, విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి ప్రయోజనం దక్కలేదని పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయానికి చోళులకంటే ముందునుంచే గొప్ప చరిత్ర ఉందని కవిత తెలిపారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన భార్య జాంబవతికి సంతానం కోసం ఇక్కడ కోడె మొక్కులు చెల్లించారనే విశ్వాసంతోనే కోడె మొక్కుల సంప్రదాయం ప్రారంభమైందన్నారు. తమ పార్టీకి, తమ పిల్లలకు రాజన్న ఆశీస్సులు ఉండాలని తాము కూడా కోడెలు కట్టేశామని చెప్పారు. వేములవాడలో కోడెను కట్టేసే సంప్రదాయాన్ని కొంగు బంగారంగా భావిస్తారని, అలాంటి ఆలయంలో కోడెలు సరైన పశుగ్రాసం లేక చనిపోవడం బాధాకరమన్నారు. కోడెలు చనిపోయినప్పుడు శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు కూడా చేయడం లేదని విమర్శించారు. హిందూత్వం గురించి మాట్లాడే స్థానిక ఎంపీ బండి సంజయ్‌ వేములవాడలో కోడెలు చనిపోతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వాటికి మంచి పశుగ్రాసం అందించి సంరక్షించాలని కోరారు.

కాంక్రీట్‌ నిర్మాణంపై అభ్యంతరం

రాజన్న ఆలయానికి రూ.250 కోట్లు తామిచ్చామంటూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం విమర్శలు చేసుకుంటూ నిధుల అంశాన్ని రాజకీయంగా మార్చాయని కవిత అన్నారు. కృష్ణశిల అందుబాటులో ఉన్నప్పటికీ, ఆగమ శాస్త్రం తెలిసినవారు ఉన్నప్పటికీ కాంక్రీట్‌తో ఆలయాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆలయ నిర్మాణం ఆలస్యమైనా కృష్ణశిలతో శాశ్వతంగా నిలిచేలా నిర్మించాలని కోరారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ ప్రసాద్‌ పథకంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ ఆలయాన్ని ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని, రాజన్న ఆలయానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా అనే విషయాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వేములవాడలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఎక్కడ చూసినా దుమ్ము కనిపిస్తోందని కవిత విమర్శించారు. రూ.5 కోట్లతో నిర్మించిన ఒక మార్కెట్‌ వృథాగా ఉందని, మరో మార్కెట్‌ను సగం నిర్మించి వదిలేశారని అన్నారు. దీంతో కూరగాయలు, పండ్ల వ్యాపారులు దుమ్ములోనే విక్రయాలు చేస్తూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రుద్రమ చెరువు తీవ్ర దుర్గంధంతో అపరిశుభ్రంగా మారిందని, చెరువులను బాగు చేయాల్సిన హైడ్రా పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకోవద్దని అన్నారు. వేములవాడలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, రోడ్లు ఇరుకుగా ఉన్నాయని చెప్పారు. తన తల్లిదండ్రుల వివాహం కూడా ఇక్కడే జరిగిందని, ఈ ప్రాంతంతో తమకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ముఖ్యంగా వేములవాడలో అండర్‌ డ్రైనేజీ అవసరముందని, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దానిపై దృష్టి పెట్టాలని కోరారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లకు ఎక్కువ ప్రాధాన్యం లభించిందని, ఇప్పుడు ఆది శ్రీనివాస్‌ విప్‌గా ఉండి వేములవాడకు ఎక్కువ చేస్తూ సిరిసిల్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నేత, చేనేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో కాకుండా వేములవాడలో యారన్‌ డిపో ఏర్పాటు చేయడం, అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడమేనన్నారు.

కాళేశ్వరం నీళ్లు.. ఎక్కడి వరకు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు ప్రయోజనం కలగాలని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదని కవిత అన్నారు. పనులన్నీ పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. 2018 మేలో అప్పటి నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వచ్చి 4 నెలల్లో రుద్రంగి రిజర్వాయర్‌ పూర్తి చేస్తామని చెప్పినా, పదేళ్లు గడిచినా అది పూర్తికాలేదన్నారు. రిజర్వాయర్‌ పూర్తయితే దాదాపు 63 వేల ఎకరాలకు కాలువల ద్వారా నీరు అందించవచ్చని చెప్పారు. దూమ్‌పేట్‌ వద్ద రిజర్వాయర్‌ నిర్మించి నీటిని లిఫ్ట్‌ చేస్తే కథలాపూర్‌, మేడిపల్లి ప్రాంతాలకు నీరు అందుతుందని, ఎర్రకుంట, పటేళ్ల చెరువులను కలిపి రిజర్వాయర్‌ నిర్మిస్తే వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాలకు నీరు ఇవ్వవచ్చని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా ఈ అంశాలను పట్టించుకోవడం లేదని, ఇకనైనా దృష్టి పెట్టాలని కోరారు. అప్పర్‌ మానేరు–మిడ్‌ మానేరు లింక్‌ పూర్తి చేస్తే 1.10 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని చెప్పారు. సిరిసిల్ల ప్రజల దశాబ్దాల రైల్వే లైన్‌ కలను సాకారం చేయాలని, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పనులను కూడా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు నవంబర్‌ వరకు కరెంట్‌ ఇవ్వాలి

వర్షాలు లేక రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నందున నవంబర్‌ వరకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సిందేనని కవిత డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కరెంట్‌ కొనుక్కొస్తుందో, అడుక్కొస్తుందో కానీ రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా ఉండొద్దని హెచ్చరించారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. సిరిసిల్లలో ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సభలో తిట్లు, విమర్శలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేసి అభివృద్ధి చేస్తామని చెప్పడాన్ని ప్రశ్నిస్తూ.. గత పదేళ్లుగా సిరిసిల్లకు మంత్రి లేరా, ఆయన ఉన్నప్పుడు నీళ్లు ఎందుకు రాలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి స్వయంగా సిరిసిల్లకు మంచి చేయవచ్చని, అందుకు మళ్లీ మంత్రిని గెలిపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

గల్ఫ్‌ బాధితులకు రూ.5 లక్షల సాయం

గల్ఫ్‌ కార్మికుల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ వేసినా ఆ కమిటీ నిర్ణయాలను చూసి అందులోని సభ్యులే రాజీనామా చేశారని కవిత అన్నారు. ఇప్పటి వరకు 112 మంది గల్ఫ్‌ కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లకు జేఎన్‌టీయూ కాలేజీ తెచ్చామని, డిగ్రీ కాలేజీ పేరు మార్చి అక్కడే పెట్టారని పేర్కొన్నారు. యువ సామ్రాట్‌గా చెప్పుకునే కేటీఆర్‌ నియోజకవర్గంలోని జేఎన్‌టీయూ కాలేజీలో ల్యాబ్‌ కోసం జగిత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. హాస్టళ్లు, ల్యాబ్‌లు లేకపోతే జేఎన్‌టీయూ కాలేజీ ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలో ఒక్క గదిలో 16 మంది ఉంటున్నారని, 140 మందికి ఒక్క వాటర్‌ ఫిల్టర్‌ మాత్రమే ఉందని తెలిపారు. విద్యార్థుల కోసం మరో హాస్టల్‌ తీసుకుని కాలేజీకి దగ్గరగా ఏర్పాటు చేయాలని, మెడికోలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేటీఆర్‌, బండి సంజయ్‌, ఆది శ్రీనివాస్‌ కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంతానికి 15 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరైనా ఇప్పటికీ పూర్తి కాలేదని, దీనిపై స్థానిక ఎంపీ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.

సెస్‌ రూ.32 కోట్ల వ్యవహారంపై విచారణ

సిరిసిల్లలోని సెస్‌ సహకార విద్యుత్‌ రంగంలో చరిత్ర సృష్టించిన సంస్థ అని కవిత అన్నారు. అలాంటి సంస్థను రద్దు చేసి ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేశారని, సెస్‌ ఉన్న సమయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందేవని, ఇప్పుడు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జరిగిన అగ్నిప్రమాదంలో సంబంధిత ఫైళ్లు కాలిపోయాయని, పలు చోట్ల ఆధారాలు మాయం చేసేలా అగ్నిప్రమాదాలు జరిగాయని విమర్శించారు. నేరెళ్ల బాధితులకు సంబంధించిన ఆధారాలు కూడా మాయం చేశారని ఆరోపిస్తూ.. సెస్‌లో జరిగిన రూ.32 కోట్ల వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నేరెళ్ల బాధితుల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వారిని మళ్లీ మోసం చేశారని కవిత విమర్శించారు. ఇటీవల సిరిసిల్లలో జరిగిన సభకు బాధితులను గ్రూపులుగా విడగొట్టి కొందరికి రూ.5 లక్షలు, మరికొందరికి రూ.10 లక్షల చెక్కులు ఇచ్చారని, ఇంత దూరం వచ్చి బాధితులకు అంతమాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం, 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నేరెళ్ల ఘటనకు సంబంధించి బాధితులు అనడానికి ఆధారాలు లేవని చెబుతున్నారంటూ.. అప్పటి జైలర్‌ నివేదికలు, అప్పటి డీఐజీ బాధితులను ఇంటర్వ్యూ చేసిన నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని నిలదీశారు. నేరెళ్ల ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల ఎస్పీని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ తరఫున కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని, ముఖ్యమంత్రి సభ అనంతరం బాధితులు తనను కలిసి తమను మోసం చేసి సభకు తీసుకెళ్లారని చెప్పారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడే పార్టీగా నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.

రేవంత్‌–మహేష్‌గౌడ్‌ది ఇడుపు కాయితం జోడీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ తమది వైఎస్‌, డీఎస్‌ జోడీ అని చెప్పుకుంటున్నారని కవిత వ్యాఖ్యానించారు. అయితే వారి మాటలు, వ్యవహారశైలి చూస్తుంటే అది ఇడుపు కాయితం జోడీలా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతుంటే పీసీసీ అధ్యక్షుడు మరోటి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వడం లేదని, ఉర్దూ జర్నలిస్టులకు మండలానికి ఒక్కటే అక్రిడిటేషన్‌ ఇస్తున్నారనే సమస్య ఉందని పేర్కొన్నారు. ముస్లింలు, ఉర్దూ భాష పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన పేరు రేవంతుద్దీన్‌ అని చెప్పుకుంటారని, కానీ ఆయనను అబద్ధాలుద్దీన్‌ అనాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పడినప్పటికీ నీటిపారుదల రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే కొనసాగుతున్నాయని కవిత అన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో గతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని పేర్కొంటూ.. మాజీ మావోయిస్టులంతా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ కూడా వారి సిద్ధాంతాలతోనే పనిచేస్తోందని, టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ప్రజా ఉద్యమాలకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ మావోయిస్టులకు గతంలో అనేక హామీలు ఇచ్చినా ఏ పార్టీ కూడా వాటిని నెరవేర్చలేదని అన్నారు.

విద్య, వైద్యానికి పాంచజన్యంలో ప్రాధాన్యం

మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలన్నదే తమ లక్ష్యమని కవిత చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన పాంచజన్యంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తామని తెలిపారు. అప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వాలపై వాటిని అమలు చేయాలని పోరాడతామన్నారు. ఇప్పటికే ఆపరేషన్‌ బ్లూ కోడ్‌ పేరుతో పార్టీ నేతలు అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రులపైనా నియంత్రణ ఉండాలని, రూ.5 సైలెన్‌ను రూ.300కు విక్రయించే పరిస్థితులు ఉన్నాయని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని విమర్శించారు. ప్రతి ఊరిలో బడి, ప్రతి తరగతికి టీచర్‌ ఉండాలన్నది తమ నినాదమన్నారు. చిన్న ప్రైవేట్‌ పాఠశాలలతో ఇబ్బంది లేదని, కార్పొరేట్‌ విద్య పేరుతో ప్రజలను దోచుకునే సంస్థలతోనే సమస్య ఉందన్నారు. తాను నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు నారాయణ, చైతన్య విద్యాసంస్థలను అక్కడికి రానివ్వలేదని, విద్య పేరుతో దోపిడీ సరికాదనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడతాం

ప్రజా సమస్యలపై ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాలు సరిగా పోరాటం చేయడం లేదని కవిత విమర్శించారు. అందుకే తాము ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ప్రశ్నించే వారు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఘటన తర్వాత తమ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో వెంటనే రూ.11 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు ధీటుగా ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మానాలకు మహర్దశ

మానాలకు మహర్దశ మూడు కీలక రహదారులకు రూ.14.20 కోట్లతో శంకుస్థాపన మానాల ప్రధాన రహదారి...

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో

కొండాపూర్‌లో నీటి కోసం రాస్తారోకో నీళ్ల బిందెలతో హుస్నాబాద్‌–కరీంనగర్‌ రహదారి దిగ్బంధం ఫోర్‌లైన్‌ పనులతో...

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి శంకరపట్నం...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం

శంకరపట్నంలో సేవా సంకల్ప్‌ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌...

అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి

అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ కాకతీయ,శంకరపట్నం:...

లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై...

కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్

కష్టకాలంలో అండగా నిలిచిన ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్ కాకతీయ, శంకరపట్నం : ముత్తారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.