కావాలనే మాజీ కార్పొరేటర్ భర్తపై తప్పుడు ఆరోపణలు..
కుటుంబ పంచాయతీ వివాదంలో కావాలని సుంకరి శివకుమార్ లాగుతున్నారు..
*చీర్ల ఉమారెడ్డి సోదరుడు మల్లారెడ్డి వివరణ..
*ఉమారెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కాకతీయ, గీసుగొండ: పంచాయితీ విషయంలో తనపై దాడి చేశాడని మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా భర్త సుంకరి శివకుమార్‌పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ బద్నామ్ చేస్తున్నారని చీర్ల ఉమారెడ్డి సోదరుడు చీర్ల మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన ఉమారెడ్డితో 2015 నుంచి కుటుంబ వివాదం కొనసాగుతోందని, గతంలో తమ ఇంటిపై దాడి ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో అక్టోబర్ 4న రూ.3 లక్షలు,తమ తల్లి బంగారంలో వాటా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.అక్టోబర్ 7న రూ.లక్ష మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 లక్షలు, బంగారం ఇవ్వకుండా పంచాయతీ వద్ద గొడవకు దిగినట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ఫోన్లు,ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.కుటుంబ వివాదంతో సంబంధం లేని సుంకరి శివకుమార్ ను కావాలనే ఇందులోకి లాగుతున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ఉమారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

