గ్రామ అభివృద్దే ద్యేయం
* సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య
* ప్రజల నీటి అవసరాలకు తక్షణ పరిష్కారం
* శనిగరం పాలకవర్గాన్ని అభినందించిన గ్రామస్తులు
కాకతీయ,కోహెడ : మండలంలోని శనిగరం గ్రామ 13వ వార్డు మల్కాపీరుల రోడ్డు కొట్రసులో పాత మోటారు పనిచేయకపోవడంతో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సిఆర్ఐ సింగిల్ మోటారు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య వెంటనే స్పందించి మోటారు ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో నీటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పేరుకా బుచ్చయ్య, వార్డు సభ్యులు జడగల సతీష్, గొంటి లక్ష్మయ్య, కాశవేణి శ్రీకాంత్, లింగంపల్లి అశోక్, మిషన్ భగీరథ ఇంట్రా సిబ్బంది జడగల లక్ష్మయ్య, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎండీ రాజ్ మహమ్మద్ తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.కొత్త మోటారు ఏర్పాటుతో నీటి సరఫరా సజావుగా సాగుతుందని, తమ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కి వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

